అమెరికాలో మంచు తుపాను బీభత్సం- స్కూళ్లు, కరెంట్ బంద్- విమానాలు రద్దు
US Winter Storm : అమెరికాలోని ఈశాన్య ప్రాంతాన్ని మంచు తుపాను ముంచెత్తింది. దీంతో చాలా చోట్ల హిమపాతం భారీగా నమోదైంది. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్, బోస్టన్‌లలో దాదాపు 1,200 విమానాలు రద్దవగా, మరో 2,700 విమాన సర్వీసుల్లో జాప్యం ఏర్పడింది. దాదాపు ఐదు కోట్ల మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Published : Feb 14, 2024, 3:14 PM IST