శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు- వృషభ, సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు - mahashivratri celebrations
దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కాళహస్తీశ్వరలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నంది వాహన సేవ నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరుడు నంది వాహనాన్ని అధిరోహించగా దేవర అయిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సింహ వాహనంపై కొలువుదీరి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వర్ణాభరణాల అలంకరణలో స్వర్ణ వాహనాలపై దివ్యదర్శనమిచ్చారు. ఆదిదంపతులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు మాడా వీధుల్లో కి చేరుకోవడంతో శ్రీకాళహస్తి భక్త జనసంద్రంగా మారింది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 9, 2024, 11:09 AM IST