Murder Unknown Person in NTR District : ఎన్టీఆర్ జిల్లాలో నిద్రపోతున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చోసుకుంది. పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకుని పాలెంలో ముల్లగిరి చిన్న వెంకటేశ్వర్లు (50) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం వెంగనాయకుని పాలెంకు చెందిన ముల్లగిరి చిన్న వెంకటేశ్వర్లు భార్య 20 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమారై ఉన్నారు. పెద్దకొడుకు అనారోగ్యంతో పక్క గ్రామంలో నివాసం ఉంటున్నాడు.
రూ.500 కోసం గొడవ- ఫ్రెండ్ కన్ను పీకేసి గొంతు కోసి హత్య
Police Have Registered a Case : వెంకటేశ్వర్ల చిన్నకుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడితో కలిసి వెంగనాయకునిపాలెంలో కరెంటు పనులు చేస్తూ ఉంటారు. ఎప్పటిలాగే శుక్రవారం కరెంటు పనికి వెళ్లి వచ్చారు. రాత్రి భోజనం చేసి కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లి పడుకున్నాడు. శనివారం ఉదయం అతడి కుమారుడు వెంకటేశ్వర్లున్ని నిద్రలేపడానికి వెళ్లాడు. రక్తపు మడుగులో ఉన్న తండ్రిని చూసి బోరుమని విలపించాడు. స్థానికుల సమాచారం మేరకు జగ్గయ్యపేట సీఐ జానకిరామ్ తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పరిశీలించి తన తలపై బలమైన రాయితో గట్టిగా కొట్టాడం వల్ల అధిక రక్త స్రావం జరిగి మరణించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కుమారుల ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
చేపల వివాదం - అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు
YSR District Person Killed : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైన ఘటన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాం వద్ద సెల్ఫోన్ ఆధారంగా అతడు మహబూబ్ బాషాగా (50) పోలీసులు గుర్తించారు. స్థానిక సీఐ తెలిపిన వివరాల ప్రకారం, మహబూబ్ బాషా శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఎవరో హత్య చేసి రైల్వే స్టేషన్ సమీపంలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
మహబూబ్ బాషా భార్య రెండు సంవత్సరాలు క్రితం మృతి చెందిందని సీఐ కరుణాకర్ తెలిపారు. వీరికి ఇద్దరు కుమారులు అని పేర్కొన్నారు. అతని భార్య మరణం తరువాత అతని కుమారులు మేనమామ వద్ద ఉంటున్నారని తెలిపారు. గత కొంత కాలంగా మహబూబ్ బాషా ఆస్తికి సంబంధించిన వివాదమే ఈ హత్యకు కారణం అయి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేసున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్ బాషా మరణంలో దాగి ఉన్న నిజాలను తొందరలోనే తెలుసుకుంటామని పేర్కొన్నారు.