ETV Bharat / opinion

మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపిన జగన్‌కు ఎందుకు ఓటేయాలి? - Jagan Siddham meetings

Pratidwani Debate on Why Woman Vote jagan: జగన్ సీఎం అయ్యక మద్యనిషేధం మరిచిపోయారు, అంగన్‌వాడీలను అణిచేశారు. ధరలు పెంచి దరువేశారు. మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపారు. ఇన్ని చేసిన జగన్, మళ్లీ సిద్ధం అంటూ ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చ.

pratidwani_debate
pratidwani_debate
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 7:38 PM IST

Pratidwani Debate on Why Woman Vote jagan: జగన్ సీఎం అయ్యక మద్యనిషేధం మరిచిపోయారు. అంగన్‌వాడీలను అణిచేశారు. ధరలు పెంచి దరువేశారు. అమరావతి మహిళలను అవమానించారు. మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపారు. వేలమంది యువతుల అదృశ్యంపై మౌనముద్ర దాల్చారు. భర్తలు తాగుడికి, బిడ్డలు గంజాయికి బానిసలుగా మారుతుంటే రోదిస్తున్న మహిళలకు విషాదాన్ని మిగిల్చారు. ఇళ్లు ఇస్తానని చెప్పి ఈసురోమనిపించారు. అయినా సరే అక్కచెల్లెమ్మలు మళ్లీ తనకే ఓటేయాలని జగన్‌ అంటున్నారు. సొంత చెళ్లెల్లే నమ్మని ముఖ్యమంత్రి జగన్‌ను రాష్ట్రంలోని మహిళలు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సిద్ధం అంటూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను నమ్మి మరోసారి ఓటు వేయటానికి మహిళలు సిద్ధంగా లేరు అనే చెప్పుకోవచ్చు. జగన్​కు ఓటు ఎందుకు వేయలని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మద్యాన్ని పూర్తిగా నిషేధించాకే ఓట్లు అడుగుతాం అని చెప్పారు. కానీ చౌక మద్యాన్ని అమ్ముతున్నారు. ఆ డబ్బు లెక్కల్లోకి రాకుండా కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. మహిళలపై నేరాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉందని నేషనల్ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌ నివేదికలు వచ్చాయి. మహిళల అదృశ్యంపై చాలా ఆందోళన నెలకొంది. దీనిపై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించే ప్రయత్నాలేమీ ప్రభుత్వం చేయట్లేదు.

తమ అన్న ఎలాంటి వాడో జగన్ సొంత చెల్లెళ్లు షర్మిలా, సునీత బహిరంగంగా చెబుతున్నారు. మా ప్రాణాలకు కూడా రక్షణ లేదని వారు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారంటే రాష్ట్రంలో జగన్ పాలన అంత దారుణంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఎన్నడూ గడప దాటి బయటకు రాని అమరావతి మహిళా రైతులను వైసీపీ వాళ్లు సామాజిక మాధ్యమాల్లో ఎంత దుర్భాషలాడారో చూశాం. అలాగే వారి పాదయాత్రపై పోలీసుల దాడిని మరిచిపోలేము. వైసీపీ నాయకులు తన స్థలాన్ని అమ్ముకోనీయకుండా బెదిరిస్తున్నారని సీఎం కార్యాలయం ఎదుట ఆరుద్ర అనే మహిళ చేయి కోసుకుంది.

సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన రంగనాయకమ్మ గారిని కేసులతో వేధించారు. ఇలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని మహిళలు ఎందుకు నమ్మాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మహిళల భద్రతకు దిశ చట్టం తెచ్చాం అన్నారు. కాని మహిళలపై నేరాల్లో మొదటిస్థానంలో రాష్ట్రం ఉంది. సీఎం జగన్ సభలకు రాకుంటే రుణమాఫీ రాదని కొత్త రుణాలు రావని డ్వాక్రా సంఘాల మహిళలను బ్లాక్‌మెయిల్‌ నేతలు బెదిరించి తీసుకెళ్తున్నారు. అక్కడకి వెళ్లాక సభకు పూర్తయ్యేదాకా బయటకి వెళ్లకుండా పోలీసులతో మూడంచెల బారికేడ్లు పెట్టి కట్టడి చేస్తున్నా సీఎం సభల నుంచి మహిళలు మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. ఇదే అంశంపై ప్రతిధ్వని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.