Pratidwani: తమిళనాడు రాజధాని మద్రాస్, కర్నాటక రాజధాని బెంగుళూరు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ వీటి అన్నింటి ఎదుగుదలలో ఆంధ్రుల పాత్ర ఉంది. మరి ఆంధ్రులకు రాజధాని ఎందుకు లేదు? వెనుకబాటు తనం ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్నిరంగాల్లో ఏపీని ఎలా అధిగమించగలిగింది? అరాచక రాష్ట్రంగా ఒకప్పుడు పేరొందిన బీహార్‌తో, కక్షసాధింపు రాజకీయాల్లో ఒకనాటి తమిళనాడుతో ఏపీని పోల్చుకునే పరిస్థితిలో ఉన్నామా? పరిశ్రమలు ఎందుకు ఏపీ నుంచి వెళ్లిపోతున్నాయి? ఏపీకి ఎందుకీ దుస్థితి? ఈ ఎన్నికల్లో ఎలాంటి నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఒకప్పుడు అరాచకత్వం తాండవించిన బీహార్‌తో, కక్షసాధింపు రాజకీయాలకు పెట్టింది పేరైన ఒకప్పటి తమిళనాడుతో ఇవాళ ఏపీని అందరూ పోల్చుకుని చూస్తున్నారు. ఏపీకి ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఏ కారణం చేత పరిస్థితి ఇంత చేజారిపోతుంది. ఏపీకి రాజధాని లేకపోవడమే ముఖ్య కారణమా? తమిళనాడు రాజధాని మద్రాస్, కర్నాటక రాజధాని బెంగుళూరు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ వీటి అన్నింటి ఎదుగుదలలో ఆంధ్రుల పాత్ర ఉంది. ప్రపంచ దేశాల్లోనూ పోర్టులు, ఎయిర్‌పోర్టులు, హైవేలు వంటివి ఆంధ్రులు నిర్మించారు. అలాంటి ఆంధ్రప్రదేశ్‌కి ఇలాంటి దుస్థితి కలగటాన్ని ఎలా చూస్తారు.
రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందనే బాధ చాలామందిలో ఉంది. ఎలాగైనా కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో ఓ గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్‌ను నిర్మించాలనే సంకల్పంలో నుంచే అమరావతి వచ్చింది. లక్ష కోట్లకు పైగా విలువ చేసే భూములను రైతులు ప్రభుత్వం చేతిలో పెట్టారు. అయినా అమరావతిని పూర్తి చేయకపోవటం రాష్ట్రానికి శాపంగా తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు జరిగిన పాలనను ఏ విధంగా విశ్లేషిస్తారు. ఏపీలో రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు వదిలేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు. పారిశ్రామిక వేత్తలతో సహా అందర్నీ వేధించటం వల్ల రాష్ట్ర ఇమేజ్‌కు ఎంతో డ్యామేజి జరిగింది. ఆ నష్టం నుంచి ఏపీ తేరుకోవాలంటే ఇప్పుడు ఎలాంటి నాయకత్వం కావాలి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవరేఖ పోలవరం ప్రాజెక్టు. గత ప్రభుత్వంలో సుమారు 72 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయి. నాటి సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టు కోసం ఏ విధంగా కృషి చేశారో తెలిసిందే. ఈ ఐదేళ్లలో ఏం జరిగింది? ఇప్పుడు జరగాల్సిందేంటి? పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేసే సత్తా ఎవరికి ఉంది? ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తారు? 2014-2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి ఏపీలో జరిగింది? మళ్లీ మంచిరోజులు రావాలంటే మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ఏపీ ఆర్థికంగా ఇంత సంక్షోభంలోకి ఎందుకు వెళ్లిపోయింది? తిరిగి రాష్ట్రాన్ని పట్టాలెక్కించి అభివృద్ధిని చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? మీరు ఏపీ ప్రజలకు ఏం పిలుపునివ్వబోతున్నారో విశ్లేషకుల ద్వారా తెలుసుకుందాం.
జగన్ పాలనలో బ్రాహ్మణుల ముఖాల్లో సంతోషం నిండిందా? - జీవితాలు మారాయా? - attacks on brahmins in AP