Pratidwani: ఎన్నికల ముందు అన్నా అంటూ ఆప్యాయత ప్రదర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చంద్రబాబు సర్కారు చాకిరీ చేయిస్తోందని, మన ప్రభుత్వం వచ్చాక అన్ని కష్టాలను తీర్చేస్తానని మాట ఇచ్చారు. చంద్రబాబు 42 శాతం పీఆర్సీ ఇస్తే, అంతకుమించి చేస్తానని వెల్లడించారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తాను అదెంత చిటికెలో పని అన్నారు. మరి జగన్ సీఎం అయ్యాకా ఏం చేశారు? ప్రభుత్వ ఉద్యోగులు ఐదు సంవత్సరాలుగా సంతోషంగా ఉన్నారా? వారి కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చిందా? ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలు ఎలా ఉన్నాయి? పదవీ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో వస్తున్నాయా? ఉద్యమాల బాట ఎందుకు పట్టాల్సి వస్తోంది. ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రతిధ్వని చర్చలో ఉపాధ్యాయ ఉద్యమ సీనియర్ నేత సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జగన్ భక్తుల్లా మారిన ఉన్నతాధికారులు, పోలీస్ బాసులు - స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగే అవకాశం ఉందా?
ఐదు సంవత్సరాల సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఏవిధంగా ఉంది. ఉద్యోగ వర్గం జగన్ పాలన గురించి ఏమనుకుంటోంది?. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు మాత్రమే ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఐదు సంవత్సరాల కాలంలో గురువులకు ఆ గౌరవం లభించిందా. ఒకప్పుడు పీఆర్సీ కోసం పోరాటాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు ఇస్తే చాలనే పరిస్థితి ఎందుకొచ్చింది? సీపీఎస్ అంటే ఏంటి? సీపీఎస్ పరిధిలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు. దానివల్ల ఉద్యోగులకు కలిగే నష్టమేంటి?
ఎన్నికల్లో గెలిచాక సీపీఎస్ రద్దుపై మాట్లాడదామంటే ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లేదు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ ఇప్పటివరకు పట్టించుకోలేదు. ప్రభుత్వం కొలువు దీరిన తొలి రెండు సంవత్సరాలు మౌనంగా ఉన్న ఉద్యోగులు తర్వాత ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగుల ఉద్యమాన్ని సహించకుండా అడుగడుగునా అణచివేతకు పాల్పడ్డారు. గళం వినిపించకుండా గృహనిర్బంధాలు చేయించారు. అయినా వదలకుండా ఉద్యోగులు పోరాటాన్ని కొనసాగించారు.
చివరకు ప్రభుత్వం చర్చలకు పిలిచి జీపీఎస్ గురించి చెప్పింది. ఇది కూడా తమను మోసం చేసేదేనంటూ ఉద్యోగులు మళ్లీ తమ ఆందోళనల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. బోధనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ ఉపాధ్యాయులు వాపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో టీచర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోవట్లేదు.
ప్రతిపక్షంలో మాటలతోనే కడుపు నింపిన జగన్ - అధికారం చేపట్టాక మొండిచేయి చూపారు
నాడు- నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశామని జగన్ పార్టీ చెబుతోంది. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే పిల్లలు కూడా గవర్నమెంట్ బడులకు వచ్చేశారని అంటోంది. కానీ ఎక్కడికక్కడ నాడు- నేడు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. హక్కుల కోసం ఉద్యమ బాట పట్టిన ఉద్యోగులపై పోలీసులు నిఘా పెట్టి కేసులు కట్టారు. వెంటపడి వేధించారు. ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా అలవాటైన ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా వారిని తప్పించిందిలేదు.
జగన్ పాలనలో అభివృద్ధి అథ:పాతాళం - అప్పులు మాత్రం అగ్రస్థానం!