Debate on Crop Loan Waiver In Telangana : రైతు రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలిరోజు లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిధులు విడుదల చేశారు. మూడు విడతల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. ఈ సందర్భంగా రేషన్‌కార్డు నిబంధనపై రైతుల్లో నెలకొన్న గందరగోళానికి ముఖ్యమంత్రి ముగింపు పలికారు. పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగానే అర్హులైన రైతులను గుర్తిస్తారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తొలిరోజు రుణమాఫీ ప్రక్రియ ఎలా జరిగింది? అర్హులైన రైతులు తమ రుణాల మాఫీ వివరాలను ఎలా తెలుసుకోవాలి? మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతులు, బ్యాంకర్లు, అధికారుల మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? అన్న అంశాలను ప్రతిధ్వనిలో తెలుసుకుందాం
రైతుల ఎదురుచూపులకు తెర - తెలంగాణలో రుణమాఫీ పండుగ - Debate on Crop Loan Waiver in TG - DEBATE ON CROP LOAN WAIVER IN TG
Crop Loan Waiver In Telangana : తెలంగాణలో ఎట్టకేలకు రైతు రుణమాఫీ ఎదురుచూపులకు తెరపడింది. హామీ ఇచ్చిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే అర్హులైన రైతులు తమ రుణ మాఫీ వివరాలను ఎలా తెలుసుకోవాలి? పూర్తి ప్రక్రియ గురించి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.
Published : Jul 19, 2024, 10:34 AM IST