Pratidhwani On Agricultural loans In Telangana : రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు పంపిణీ లక్ష్యం చేరుకునేది ఎప్పుడు? ఏటా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, ఉంటారు. ప్రభుత్వం వైపు నుంచి, బ్యాంకర్ల వైపు నుంచీ ఘనమైన లక్ష్యాలు నిర్ధేశించుకుంటూ ఉంటారు. వాటిని ఎలా చేరుకోవాలని విస్తృత స్థాయిలో చర్చిస్తూ ఉంటారు. కానీ అవన్నీ అయిపోయాక అంతిమ లబ్దిదారులు అయిన రైతులకు చేరుతున్న పంట రుణాలు ఎంత?
వ్యవసాయ రుణాలు పంపిణీపై గత కొద్ది సంవత్సరాలుగా రైతుసంఘాలను, వ్యవసాయరంగం నిపుణుల్ని ఈ ప్రశ్నల కలచి వేస్తోంది. మరి ఈ విషయంలో రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పంట రుణాలపై అధ్యయనాలేం చెబుతున్నాయి? వ్యవస్థాగత పరపతి సౌకర్యం ప్రతిరైతును చేరుకోవడానికి ఏం చేయాలి? రాష్ట్రంలో ఏటా రైతులకు పంట రుణాల వితరణ లక్ష్యాలను భారీగానే నిర్థేశించుకుంటున్నారు. కానీ వాటిల్లో ఎంతమేరకు పూర్తిచేస్తున్నారు?
రైతుసంఘాల అధ్యయనాలేం చెబుతున్నాయి? సాధారణంగా ప్రైవేటుమార్గాల్లో రైతులు సమీకరించుకునే అప్పులకు, బ్యాంకురుణాలకు తేడా ఏమిటి? ఎస్ఎల్బీసీ లక్ష్యాలు చేరుకోక పోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? పంట రుణాల వితరణలో జిల్లాలు, ప్రాంతాల వారీగానూ తేడాలున్నాయి. కొన్నిచోట్ల లక్ష్యాన్ని మించుతుంటే కొన్నిచోట్ల కనీసం 50శాతం కూడా చేరుకోవడం లేదు, ఇందులో మర్మమేంటి? బ్యాంకురుణాల విషయంలో పెద్దలకు ఒకన్యాయం, పేదలకు మరో న్యాయం ఉండొద్దని మంత్రి తుమ్మల ఎస్ఎల్బీసీ భేటీలోనే అన్నారు. అయితే ఏళ్లుగా ఈ వివక్ష ఎందుకు పోవడం లేదు?
తెలంగాణ రైతాంగంలో ఎంతమంది ఈ వ్యవస్థాగత పరపతి సౌకర్యం పరిధిలోకి వచ్చారు? రానివారెందరు, వారి స్థితిగతులు, రుణభారాలపై ప్రభుత్వాల వద్ద సమాచారం ఉందా? రాష్ట్రంలోని ప్రతిరైతుకు, ప్రతి సీజన్‌కు సకాలంలో వ్యవసాయ రుణాలు అందాలంటే ఏం చేయాలి? బ్యాంకర్లు, ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేయాలి? రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న రుణ మాఫీ పథకం ప్రభావం ఏమైనా వ్యవసాయరుణాలపై ఉంటోందా ? రైతుభరోసా సాయం కోసం ప్రస్తుతం విధివిధానాలు ఖరారు చేసే పనిలో ఉన్న నేపథ్యంలో నేటి ప్రతిధ్వని.
నేడే పూర్తిస్థాయి తెలంగాణ బడ్జెట్ - కేటాయింపులపై ఉత్కంఠ - PRATIDHWANI ON TELANGANA BUDGET