Prathidhwani Debate On Engineering Courses : ఇంజినీరింగ్ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కావడంతో కళాశాలల ఎంపిక, కోర్సుల వివరాలు, వెబ్ ఆప్షన్ల నిర్వహణ గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు లోతుగా పరిశీలిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ల అవకాశాలు, డిమాండ్ ఉన్న కోర్సులు గురించి ఆరా తీస్తున్నారు. ఇంజినీరింగ్‌తో పాటు ఇంటర్ తర్వాత విద్యావకాశాలు ఎలా ఉన్నాయి. ఎలాంటి కాలేజీలో సీటు వచ్చినా ఇంజినీరింగ్ కోర్సు కాబట్టి అందులో చేరాల్సిందేనా ప్రత్యామ్నాయ కోర్సులు ఏమున్నాయని విద్యార్థుల్లో అనేక ఆలోచనలు వస్తున్నాయి.
ఇంజినీర్ కోర్సులకు దీర్ఘకాలికంగా మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి కోర్సులకు ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈసారి కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎలా జరగనుంది? ఇంజినీరింగ్ విద్య విషయంలో ప్రాధాన్యం ఇవ్వాల్సింది కాలేజీలకా లేక కోర్సులకా? ఇంటర్ తర్వాత ఎలాంటి విద్యావకాశాలు అందుబాటులో ఉన్నాయి? ఇదే నేటి ప్రతిధ్వని.