Prathidhwani on Skill Development : మన దేశంలో ఏటా పట్టాలు పుచ్చుకొని కళాశాలల నుంచి బయటకు వస్తున్న యువతలో పారిశ్రామిక అవసరాలకు తగిన వారు 45 శాతమే ఉంటున్నారు. ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో 80 శాతం మందిలో ఉద్యోగ నైపుణ్యాలు కొరవడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. విద్యార్థుల్ని సొంతకాళ్లపై నిలబెట్టేలా చిన్ననాటి నుంచే వృత్తి విద్యలు బోధించాలనే వారు జాతిపిత మహాత్మాగాంధీ. ఏ దశలో చదువు మానేయాల్సి వచ్చినా బతుకుతెరువుకు ఢోకా ఉండరాదన్నది బాపూజీ సత్సంకల్పం. ‘యువ రక్తంతో ఉప్పొంగుతున్న ఇండియాయే నేడు ప్రపంచ అతిపెద్ద ప్రతిభా కర్మాగార’మని ప్రధాని మోదీ ఒక సందర్భంలో అన్నారు. డిగ్రీలు, పీజీలు, డాక్టరేట్లు చేసిన వారెందరో సరైన బతుకుతెరువు దొరక్క ఏదో ఒక కొలువు దక్కిందే చాలనుకుంటూ అరకొర వేతనాలతో భారంగా జీవితం నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చటం ఎలా? ఇదీ నేటి ప్రతిధ్వని.
Indian YOUTH Skills : దేశంలో అపార యువశక్తి ఉంది. మరి వారిలో చదువుకు తగినట్టు నైపుణ్యాలు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం నియమించిన అనేక కమిటీల్లో పరిశీలనలో, పరిశోధనల్లో ఏం తేలింది? ఈరోజు లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు ఏటా వస్తున్నా వారికి తగిన ఉద్యోగావకాశాలు ఎందుకు కల్పించలేకపోతున్నాం? పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు విద్యార్థులకు అందించటంలో ఎందుకు వెనుకబడ్డాం? దీనిని మార్చటం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి?
చాలామంది ప్రతిభావంతులైన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు విదేశాల్లో ఎమ్ఎస్ చేయటం కోసం వెళ్లిపోతున్నారు. తర్వాత అక్కడే సెటిల్ అవుతున్నారు. ఈ మేథోవలసను ఆపలేమా? విదేశాలకు, మన దేశానికి మధ్య మీరు గమనించిన తేడాలేంటి? భారత్ నుంచి ఎందుకు లక్షల మంది సాంకేతిక నిపుణులు విదేశీబాట పడుతున్నారు? చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం పొందట్లేదు అంటే లోపం ఎక్కడుంది? విద్యార్థిలోనా? వారు చదువుకున్న సిలబస్‌లోనా? సరైన అధ్యాపకులు, ల్యాబ్‌లు లేని కాలేజీల్లోనా? దోషం ఎక్కడుంది? స్టెమ్ కోర్టులు అంటే (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం) ఈ కోర్సులను ప్రోత్సహించటం కోసం ప్రస్తుతం ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది? ఇంజినీరింగ్ అలాగే డిగ్రీ కోర్సుల్లో చదివే విద్యార్థులకు నిపుణలు సూచనలు ఏంటి? ఇదీ నేటి ప్రతిధ్వని.