ETV Bharat / opinion

కృష్ణా నదీ జలాల వివాదం- అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ఏ తీరాలకు చేర్చనుంది? - Krishna Water Dispute - KRISHNA WATER DISPUTE

Prathidwani: రాష్ట్రానికి నీటి కష్టం పొంచి ఉంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో చివరి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు పెనుప్రమాదం ముంచుకొస్తోంది. కొద్దిరోజులుగా కాగుతున్న కృష్ణా నదీ జలాల వివాదం చివరకు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ఏ తీరాలకు చేర్చనుంది? కృష్ణాజలాలు - కొత్తప్రభుత్వం ముందున్న సవాళ్లు అనే అంశంపై నేటి ప్రతిధ్వని.

Prathidwani on Krishna Water Distribution
Prathidwani on Krishna Water Distribution (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 10:46 AM IST

Prathidwani : రాష్ట్రానికి నీటి కష్టం పొంచి ఉంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో చివరి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు పెనుప్రమాదం ముంచుకొస్తోంది. కొద్దిరోజులుగా కాగుతున్న కృష్ణా నదీ జలాల వివాదం చివరకు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ఏ తీరాలకు చేర్చనుంది? కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి గత నవంబర్‌లో బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు ఇచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతోంది? కృష్ణాజలాల పంపిణీ పున:పరిశీలనంటూ జరిగితే అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్యే ఉండాలన్న వాదనల్ని జగన్ ప్రభుత్వం కొనసాగించలేక పోయింది? ఈ అయిదేళ్ల తప్పిదాల్ని సరి చేయడంతో పాటు కృష్ణాజలాల విషయంలో కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? కృష్ణాజలాలు - కొత్తప్రభుత్వం ముందున్న సవాళ్లు అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సాగునీటి రంగం నిపుణులు, కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ పుస్తక రచయిత టి. లక్ష్మీనారాయణ, రైతుసేవా సంస్థ అధ్యక్షుడు ఏ భవానీప్రసాద్ పాల్గొంటున్నారు.

CM Jagan Silence in Krishna Water Issue: కృష్ణా జలాల అంశంలో ఆ రోజు జగన్ ఎందుకు మాట్లాడలేదు.. అదే నేడు ఏపీకి శాపంగా మారిందా..?

కృష్ణా జలాల నీటిహక్కుల విషయంలో కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోన్న సవాళ్లు ఏమిటి? రాష్ట్రం మొత్తం సాగు, తాగునీటి అవసరాల్లో కృష్ణాజలాల వాటాఎంత? ఇవే సవాళ్లు కొనసాగితే రాష్ట్రం నీటివనరుల పరంగా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది? కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి గతేడాది నవంబర్‌లో బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు ఇచ్చిన కొత్తమార్గదర్శకాల ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతోంది? కృష్ణాజలాల పంపిణీ పున:పరిశీలనంటూ జరిగితే భాగస్వామ్యులైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ఉండాలి. రాష్ట్రంలోని గతప్రభుత్వమూ అదే వాదించింది. కానీ తర్వాత ఏం జరిగింది? జగన్ ప్రభుత్వం అదే వాదన కొనసాగించి, హక్కుల్ని ఎందుకు కాపాడలేకపోయింది?

Bojja Dasaratharami Reddy Fires on CM Jagan: కృష్ణా జలాల పంపిణీపై పునఃసమీక్ష నిర్ణయం .. ఏపీకి బ్లాక్ డే : దశరథరామిరెడ్డి

కృష్ణాజలాల వాటాల హక్కులు పరిరక్షించుకోలేక పోతే మరీ ముఖ్యంగా రాయలసీమపై ఎలాంటి ప్రభావం పడుతుంది. అదే ప్రాంతానికి చెందిన జగన్ అయిదేళ్లుగా దీనిపై ఏం చేశారు? నిజానికి ఇదే ముఖ్యమంత్రి జగన్ పొరుగురాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉంటే వెళ్లి చప్పట్లు కొట్టి వచ్చారు. కానీ కృష్ణాజలాల వివాదాన్ని సామరస్యంగా ఎందుకు పరిష్కరించలేక పోయారు?

ఇప్పుడు జూన్‌-4 తర్వాత రాష్ట్రంలో కొలువుదీరబోతున్న కొత్త ప్రభుత్వంపై కృష్ణాజలాల వాటా పరిరక్షణపై ఉన్న గురుతర బాధ్యత ఏమిటి? అందుకోసం ఏం చేయాలి? మీరు చూసిన మేరకు గడిచిన అయిదు సంవత్సరాల అనుభవాల నుంచి కొత్త ప్రభుత్వం నేర్చు కోవాల్సిన పాఠాలు, చేయకూడని పొరపాట్లు ఏమిటి? అనే సందేహాలపై చర్చలో సాగునీటి రంగం నిపుణులు, కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ పుస్తక రచయిత టి. లక్ష్మీనారాయణ, రైతుసేవా సంస్థ అధ్యక్షుడు ఏ భవానీప్రసాద్ ఏమంటున్నారంటే!

CM Jagan Silent In Krishna Water Allocations: కృష్ణా జలాల కేటాయింపుల్లో సీఎం జగన్ అసమర్థత.. రైతులు, సాగునీటి రంగ నిపుణుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.