ETV Bharat / opinion

నవరత్నాల పేరుతో జగన్ నయవంచన - అసలు విషయం ఏంటంటే? - YSRCP Navaratnalu Schemes

Prathidwani Debate on YSRCP Navaratnalu Schemes: నవరత్నాల పేరిట గత ఎన్నికల వేళ ప్రజల్ని జగన్ మభ్యపెట్టారు. ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తానంటూ నమ్మించారు. అధికారంలోకి వచ్చాక పాత పథకాలన్నీ రద్దు చేసిన జగన్, నవరత్నాల పథకాల్లోనూ అర్హుల పేరిట అడ్డగోలుగా కోత పెట్టారు. సంపూర్ణ మద్యనిషేధం హామీని అటకెక్కించారు. ఇంతకీ ఈ విషయంలో జగన్ ప్రజలకు ఏం మంచి చేశారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

YSRCP_Navaratnalu_Schemes
YSRCP_Navaratnalu_Schemes
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 11:19 AM IST

Prathidwani : జగన్‌ ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో ప్రజలను ఊరించారు. ఆ 9 పథకాలతో కోట్లాదిమంది జీవితాల్లో వెలుగులు తెస్తానన్నారు. జనం నమ్మారు. అధికారం ఇచ్చారు. మరి ప్రజల జీవితాలు బాగుపడ్డాయా? పేదరికాన్ని పారద్రోలారా? గృహిణులను లక్షాధికారులను చేశారా? పాత ఇంటికి సున్నాలు వేసినట్టు, పాత బోర్డుకు రంగులు అద్దినట్టు ఇందులో గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఎన్ని ఉన్నాయి? ఏఏ పథకాలకు జగన్ పేరు మార్చారు? నవరత్నాల పేరుతో చేసింది నయవంచన కాదా? జగన్ సీఎం అవకముందు లేనివి, కొత్తగా ప్రజలకు ఇచ్చినవి ఏవి? నవరత్నాల లోగుట్టు ఏంటి?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంలో నవరత్నాల హామీలు కీలక పాత్ర పోషించాయి. మద్య నిషేధం నుంచి ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకు నెత్తిన చేయి పెట్టి నాదీ హామీ అంటూ సీఎం జగన్‌ తీయని మాటలు చెప్పి అయిదేళ్లు గడిచిపోయాయి. అసలు జగన్ చెప్పిన ఆ నవరత్నాలు ఏంటి? వాటిల్లో పేర్లు మార్చిన పథకాలు ఎన్ని? నవరత్నాల వెనుక ఉన్న నవమోసాల మాటేంటి? జలయజ్ఞమేది? మద్య నిషేధం ఏది? జగన్ మాటలు నమ్మి, ఆశపడి ఓట్లేసిన ప్రజల పరిస్థితేంటి?

మాట తప్పను మడమ తిప్పను, విశ్వసనీయతకు చిరునామా, చిన్న పిల్లలకు మేనమామ అంటూ జగన్ తన అరచేతి వైకుంఠంలో చూపించింది నవరత్నాలనా? రంగురాళ్లనా? ఆ నినాదం వెనుక ఉన్న అసలు రంగేంటి? ముఖ్యమంత్రి చెప్పింది ఒకటి చేస్తుంది మరొకటి. మద్యపానం నిషేధం లేదు, మద్యం నియంత్రణ లేదు. మద్యం నిషేధం చేయకపోవడంతో పేద ప్రజలు నష్టపోతున్నారు. ఈ విషయంలో అసలు జగన్ ఏం చెప్పారు, ఏం చేశారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. దీనిపై చర్చించేందుకు సామాజిక కార్తకర్త షేక్ సిద్ధిఖ్‌, రాజకీయ విశ్లేషకులు వినీల పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జగన్ సీఎం అయ్యాక కట్టిన కొత్త ప్రాజెక్టులు ఏవి ? సాగు, తాగునీటిపై ప్రజలకు​ చేసిందేంటి? - YCP Not completeIrrigation Projects

మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామంటూ వైఎస్సార్​సీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 'ప్రకాశించని నవరత్నాలు - జగన్‌ మోసపు లీలలు' పేరిట టీడీపీ వాస్తవపత్రం అంటూ గతంలో ఓ పుస్తకం సైతం విడుదల చేసింది. రైతు భరోసా కింద 13 వేల 500 రూపాయల పెట్టుబడి సాయం కింద ఇస్తానని చెప్పిన జగన్​, ఇచ్చేది కేవలం రూ.7వేల 500 మాత్రమేనని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. రైతు భరోసా కింద 12 హామీలు ఇస్తే, ఒక్కటీ అమలు చేయలేదని, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో 8 అమలు కాలేదని తెలిపారు.

పింఛన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో రెండు అమలు కాలేదని పేర్కొన్నారు. అమ్మ ఒడి కింద ఇచ్చిన 2 హామీల్లో రెండూ అమలు కాలేదని స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన 5హామీల్లో 5అమలు కాలేదన్నారు. బోధనా రుసుము చెల్లింపు కింద ఇచ్చిన 2 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు.

జగనన్నకు ఉన్న కసి ఏంటి - దానికోసం ఏ మేరకు పని చేశారు?

వైయస్సార్ జలయజ్ఞం కింద ఇచ్చిన 3 హామీలకు మూడూ పెండింగ్​లోనే ఉన్నాయని మండిపడ్డారు. మద్య నిషేధం అంటూ ఇచ్చిన ఒక్క హామీ ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. వైఎస్సార్ ఆసరా, చేయూతల కింద ఇచ్చిన 4 హామీల్లో 4 పెండింగ్​లోనే ఉన్నాయని మండిపడుతున్నారు.

మరోవైపు నేటి కార్యక్రమంలో ఆరోగ్యశ్రీలో గతాని కంటే జగన్ వచ్చాక ఒనగూరిందేంటి? జగన్ వచ్చాక ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా పూర్తయిందా? పేదలదంరికీ ఇళ్లు హామీ లక్ష్యాన్ని ఎంతమేరకు చేరుకున్నారు? ఆసరా, చేయూత పథకాల అమలు పరిస్థితి ఏంటి? ఇలా నవరత్నాల పేరుతో ప్రజలను జగన్ ఎలా మోసం చేశారో అనే దానిపై వక్తలు చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కోసం పైన లింక్​పై క్లిక్ చేసి చూడండి.

ఏం చేశారని జగన్ పార్టీకి దళితులు ఓటేయాలి ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.