ETV Bharat / opinion

విదేశాల్లో ఈజీ జాబ్, లక్షల్లో జీతమంటూ కేటుగాళ్ల బురిడీ - నమ్మారో అంతే సంగతులు - Foreign Job Scams in Telangana

Prathidhwani on Job Frauds in Abroad : ఆశలే ఆసరాగా కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. విదేశాల్లో ఈజీ జాబ్, లక్షల్లో జీతమంటూ బురిడీ కొట్టిస్తున్నాయి. నమ్మి విమానమెక్కితే సర్వం దోపిడీ చేస్తున్నాయి. కాంబోడియా కేసు ఒక్కటే కాదు, తెలుగురాష్ట్రాల్లో వేలమంది వ్యథ ఇది. మరి విదేశాల్లో ఉద్యోగాలంటే ఎలాంటి అవగాహన, జాగ్రత్త అవసరం? నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ చట్టాలేం చెబుతున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 9:55 AM IST

Foreign Job Scams in Telangana
Foreign Job Scams in Telangana (ETV Bharat)

Prathidhwani On Foreign Job Scams : కొలువుల కలలు కళ్ల ముందే ఛిన్నాభిన్నం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా విదేశీ ఉద్యోగాల ఆశలు నిలువునా మునిగేలా చేస్తున్నాయి. విదేశాల్లో ఆకర్షణీయమైన ఉద్యోగాల పేరిట ఊరిస్తున్న అందమైన ప్రకటనలు చివరకు బాధితుల్ని ఊహించని చిక్కుల్లో పడేస్తున్నాయి. రోజురోజుకు ఈ తరహా మోసాలు లెక్కకుమిక్కిలిగా పెరిగి పోతున్నాయి. కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాలు అంటే నమ్మి మోసపోయిన 150 మంది కష్టం ఒక తాజా ఉదాహరణ మాత్రమే.

అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్, మలేషియా, ఇలా అనేకదేశాల్లో కొలువుల పేరుతో నకిలీ సంస్థలు విసురుతున్న వలకు చిక్కి విలవిల్లాడుతున్నారు యువత. ఆశలే ఆసరాగా చేసుకుని అక్రమార్కులు మోసగిస్తున్నారు. ఇవన్నీ చాలావరకు ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌క్రైమ్‌ ముఠాల పనే. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరు చెప్పి మోసాలు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.4, రూ.5 లక్షల వరకు దోపిడీ చేస్తున్నారు.

కొన్నిసార్లు టూరిస్ట్ వీసాపై తీసుకెళ్లి విదేశాల్లో అమ్మకానికి పెడుతున్నారు. మరోవైపు విదేశాల్లో బంధించి హింసలకు గురిచేసిన ఉదంతాలు ఉన్నాయి. అందుకే కంపెనీ కాంట్రాక్ట్‌లు, అగ్రిమెంట్లను సరిచూసుకోవాలి. మరి విదేశాల్లో ఉద్యోగాలంటే ఎలాంటి అవగాహన, జాగ్రత్త అవసరం? నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ చట్టాలేం చెబుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.