How to Control Road Accidents in India: దేశంలో ఏటా లక్షన్నర మందికి పైగా కబళిస్తున్నాయి రోడ్డు ప్రమాదాలు. 50 లక్షల మందికి పైగానే వికలాంగులు అవుతున్నారు. వీరి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర కష్టాల పాలవుతున్నాయి. నిత్యం సగటున 462మంది, ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతున్న పరిస్థితుల్లో రహదారులపై రక్తపుచారికల తడి ఆరడం లేదు.
ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 19 మంది దాకా మరణిస్తున్నారు. నిత్యం సగటున 1264 చిన్న, పెద్ద రహదారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రహదారి మరణాల్లో భారత వాటా 11%గా ఉంది. ఏటా వేలాది కుటుంబాల్లో రోడ్డు టెర్రర్ విషాదం నింపుతోంది. రోడ్డు ప్రమాదాలు జీడీపీలో 3.14% నష్టానికి కారణమవుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. మరణాల్లో 80% తలకు గాయంతోనే అని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
అయిదేళ్లుగా గాడి తప్పిన వ్యవస్థలు-దిక్కులేకుండా పోయిన ప్రజాహక్కులు - law and order in ap
అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి చిన్నచిన్న కారణాలతో ఎంతోమంది మరణిస్తున్నారు.
మరి ఇంతటి స్థాయిలో ఆందోళన కలిగిస్తోన్న రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి? అతివేగం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ముప్పు ఎంతగా ఉంటుంది. తీవ్రస్థాయి రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం ఎలా?
దేశంలో రహదారి ప్రమాద మరణాల్ని 2030 నాటికి కనీసం సగానికి తగ్గించాలని ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అది నెరవేరాలంటే ఎలాంటి వ్యూహం, కార్యాచరణ అవసరం? ప్రభుత్వం, పౌర సమాజం ముందు ఈ విషయంలో ఉన్న సవాళ్లేంటి? ఏటా వేలాది కుటుంబాల్లో విషాదం నింపుతున్న ఈ రోడ్డు టెర్రర్‌కు అడ్డుకట్ట వేసేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
క్షణికావేశం తీరని విషాదం-కుటుంబాల్లో అంతులేనిశోకం- బీ స్ట్రాంగ్ - Prathidwani on Trolling Suicides
దేశంలో, రాష్ట్రంలో రహదార్లపై రక్తపుచారికల తడి ఆరడం లేదు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై తట్టెడు తారు, సిమెంటు కూడా వేయలేదు. కొత్త రోడ్లు వేయలేదు, ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయలేదు. ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలే. జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలను కలిపే రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్ల పరిస్ధితి చెప్పాల్సిన పని లేదు. అత్యంత దారుణంగా ఉండే ఈ రోడ్లపై గజానికో గుంత, అడుగుకో గొయ్యి దర్శనమిస్తుంది.
జాతీయ రహదారులపై అతివేగం, నిద్రమత్తు, మద్యంతో అధిక ప్రమాదాలు జరుగుతుండగా రాష్ట్ర రహదారులపై మాత్రం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకుంటున్నాయి. రహదారి ప్రమాదాలు ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశం. వారి ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ అవసరం. అందువల్ల ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలి. నిపుణులు చెప్పిన సూచనలను కఠినంగా అమలు చేయాలి. లేకుంటే రాష్ట్ర రహదారులపై ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంటాయి. ప్రజల ప్రాణాలు పోతూనే ఉంటాయి.
సప్తసముద్రాలు దాటివెళ్తున్న యువత - విదేశీ విద్యకు ఉన్న అవకాశాలేంటి? - Youngsters Foreign Education