Prathidwani: అయిదేళ్ల కాలంలో రాష్ట్రంలో దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో వైసీపీ నాయకులు పెట్రేగిపోయారు. అన్యాయాలను ప్రశ్నించినందుకు, అరాచకాలపై ఫిర్యాదు చేసినందుకు, ఇష్టారీతిన దాడులు చేశారు. బాలికలు, వృద్ధులపైన కూడా మూకదాడులతో రెచ్చిపోయారు. అసలే అరాచకశక్తులైన వైసీపీ నేతలకి అధికారం తోడవడంతో, రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా దాష్టీకాలకు పాల్పడ్డారు. నేరచరితుల జోలికి వెళ్లని పోలీసులు, బాధితులపైనే తిరిగి కేసులు పెట్టారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఐదేళ్ల జమానాలో జగన్ పరివారం రాష్ట్రంలో వందలమంది నెత్తురు పారించారు. ప్రాణాలు హరించారు. రాళ్ల వర్షాలు కురిపించారు. పట్టపగలే దౌర్జన్యాలకు తెగబడ్డారు. సామంత రాజ్యాలుగా మార్చుకుని ప్రకృతిని, ప్రజాసంపదను కొల్లగొట్టారు. ప్రశ్నించిన వారి పీక పిసికారు. ఎన్నికల్లో గెలవడం కోసం హింసను రగిలించారు.
2019 ఎన్నికల ముందు కోడికత్తి నాటకం రక్తికట్టించిన జగన్, ఇప్పుడు జగన్‌పై గులకరాయి వేశారంటూ నానా హంగామా చేస్తున్నారు. జగన్‌పై గులకరాయి వేశారంటూ పేదలపై హత్యాయత్నం కేసులు మోపే ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌పై గులకరాయి వేస్తే హంగామా ఏంటని ఆయన సొంత చెల్లి షర్మిలనే ప్రశ్నించారు. వివేకాపై గొడ్డలిపోటు వేసినోళ్లను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. ఐదేళ్లుగా ప్రకృతిని, ప్రజాసంపదను కొల్లగొట్టిన జే-గ్యాంగ్, అరాచకాల్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధించారు.
జగన్ పాలనలో బ్రాహ్మణుల ముఖాల్లో సంతోషం నిండిందా? - జీవితాలు మారాయా? - attacks on brahmins in AP
భూ ఆక్రమణలపై ఫిర్యాదు చేసినందుకు దళిత న్యాయవాదిపై అతనిపై వైసీపీ నేతలు దాడికి తెగబడతారు. కళాశాలలో ఎప్పుడో జరిగిన ఓ చిన్నపాటి గొడవను మనసులో పెట్టుకుని ఓ దళిత యువకుడ్ని కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురిచేస్తారు. మంచినీళ్లు అడిగితే మూత్రం పోసి అమానుషంగా ప్రవర్తిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా పాదయాత్ర చేస్తున్న 70 ఏళ్ల వృద్ధుడ్ని సైతం వదలకుండా అధికార దర్పంతో దాష్టీకానికి పాల్పడతారు.
దాడులతో చెలరేగిపోతున్నారు: శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ అభిమానులపై దౌర్జన్యానికి తెగబడతారు. దాడులు, దౌర్జన్యాలు, దాష్టీకాలతో చెలరేగిపోతోంది. అదే విధంగా కొద్ది నెలల క్రితం కంచికచర్లలో దళిత యువకుడిపై జరిగిన అమానుష ఘటన మరవక ముందే, కొలిమిగుండ్లలో దళిత న్యాయవాదిపై వైసీపీ నేతలు చేసిన దాడి, రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న వైసీపీ ప్రాయోజిత అరాచకాన్ని మరోమారు కళ్లకు కట్టింది.
రాష్ట్రంలో భయానక పరిస్థితులు: బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు వైసీపీ పాలనలో ఏపీలో నిత్యకృత్యమైపోయాయి. అధికార పార్టీ నేతల అరాచకాల్ని చూస్తూ, తాము మాత్రం ఏం తక్కువ అన్నట్లుగా అసాంఘిక శక్తులు, రౌడీమూకలు మరింతగా రెచ్చిపోతున్నాయి. రోడ్డుకు అడ్డంగా పెట్టిన ద్విచక్రవాహనాన్ని తీయాలంటూ హారన్ మోగించినందుకు నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ను బస్సు నుంచి కిందికి దింపి అందరూ చూస్తుండగా విచక్షణరహితంగా దాడి చేయటం రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. వీటిని ఉక్కుపాదంతో అణిచేయాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకుల అరాచకాలకు వత్తాసు పలుకుతుండటంతో రాష్ట్రం ‘‘అరాచకాంధ్రప్రదేశ్ ’’ గా మారిపోయింది.
వర్సిటీలతో రాజకీయం - వైసీపీ కార్యాలయాల్లా విశ్వవిద్యాలయాలు - Universities as Centers of Politics
మరి 2019 ఎన్నికల్లో కోడికత్తిలా, 2024లో జగన్ గులకరాయి ఓట్లు కురిపిస్తుందా? బాహుబలిలో కాలకేయుల్లా, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లలాగా ఈ ఐదేళ్లలో వైసీపీ చేసిన అకృత్యాలేంటో నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం. దీనిపై చర్చించేందుకు రాజకీయ విశ్లేషకులు ఎ.శ్రీనివాసరావు, దళిత ఉద్యమకారుడు చిలుకా బసవయ్య పాల్గొన్నారు. ప్రతిధ్వని కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియో కోసం పైన లింక్‌పై క్లిక్ చేసి చూడండి.