Prathidhwani : కొలువుల కలలు కళ్ల ముందే ఛిన్నాభిన్నం అవుతున్నాయి. మరీముఖ్యంగా విదేశీ ఉద్యోగాల ఆశలు నిలువునా మునిగేలా చేస్తున్నాయి. విదేశాల్లో ఆకర్షణీయమైన ఉద్యోగాల పేరిట ఊరిస్తోన్న అందమైన ప్రకటనలు చివరకు బాధితుల్ని ఊహించని చిక్కుల్లో పడేస్తున్నాయి. రోజురోజుకీ ఈ తరహా మోసాలు లెక్కకుమిక్కిలిగా పెరిగి పోతున్నాయి. కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాలు అంటే నమ్మి మోసపోయిన 150మంది కష్టం ఒక తాజా ఉదాహరణ మాత్రమే. అమెరికా, ఇంగ్లండ్, దుబాయ్, మలేషియా, ఇలా అనేకదేశాల్లో కొలువుల పేరుతో నకిలీ సంస్థలు విసురుతున్న వలకు చిక్కి విలవిల్లాడుతున్నారు యువత. మరి విదేశాల్లో ఉద్యోగాలంటే ఎలాంటి అవగాహన, జాగ్రత్త అవసరం? నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ చట్టాలేం చెబుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు బీఎంఆర్ ఇన్నోవేషన్స్ సీఈవో శ్రీధర్ బెవర, ఇమ్మిగ్రేషన్ న్యాయ నిపుణురాలు జనేతా ఆర్ కంచర్ల
సప్తసముద్రాలు దాటివెళ్తున్న యువత - విదేశీ విద్యకు ఉన్న అవకాశాలేంటి? - Youngsters Foreign Education
మానవ అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారడం తీవ్ర ఆందోళనకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న 150 మంది తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి సహాయపడాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌ను ఎక్స్ ద్వారా కోరారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్ర యువతను అక్రమంగా కాంబోడియా తరలించి సైబర్ క్రైమ్ ఉచ్చులోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
టీడీపీతో ఉద్యోగాలు- వైసీపీతో వలసలు! యువతకు అసలు సిసలు పరీక్ష ఇదే - CM Jagan Cheating Youth