Vague Posts in Social Media Platforms : సామాజిక మాధ్యమ వేదికలు నేడు ప్రజల రోజువారీ జీవితాల్లో విడదీయలేనతంగా భాగం అయ్యాయి. నెటిజన్లు తమ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో జరిగే ప్రతీ సందర్భాన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలపై పంచుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఉన్మాదులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లోని ఫోటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను అనైతిక పద్ధతుల్లో వక్రీకరిస్తున్నారు. ఫలితంగా చిన్న, పెద్ద తేడా లేకుండా రోజూ అసంఖ్యాకంగా జనం వేధింపులకు, అవమానాలకు గురవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తెలిసిందే. దీనిపై సినీ హీరోలు, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలా డిజిటల్ వేదికలపై అకృత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? వీటి వల్ల మహిళలు, చిన్నారులపై ఎలాంటి ప్రభావం పడుతోంది? డిజిటల్ దుర్మార్గులకు బీఎన్ఎస్ వంటి కొత్త నేరన్యాయ చట్టాల ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయి? ఇదే నేటి ప్రతిధ్వని.