Prathidhwani Debate on Private Money Lenders : చిరువ్యాపారులు, చిరుద్యోగులు, రైతులకు రుణాల మంజూరులో బ్యాంకులు అలసత్వం వహిస్తున్న కారణంగా ప్రజలు ప్రైవేట్ అప్పులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాల్ని అవకాశంగా తీసుకుని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. అప్పుల కోసం ఖాళీ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను ప్రజలు తనఖా పెడుతున్నారు. నగలు, స్థిరాస్తి డాక్యుమెంట్లు కుదవపెడుతున్న గ్రామీణ జనం. దీంతో అప్పుల ఊబిలో చిక్కుకుని సకాలంలో వడ్డీలు చెల్లించలేకపోతున్నాయి అల్పాదాయ వర్గాలు.
Money Lenders Harassment on Borrowers : అప్పులిచ్చిన వారి ఆగడాలను భరించలేని వారు కొత్త అప్పులు చేస్తూ, ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతుంటే, ఆ వేధింపులు తట్టుకోలేని కొందరు అత్మహత్యలకు పాల్పడుతున్నారు. అసలు వడ్డీ వ్యాపారులు ప్రభుత్వం నుంచి ఏఏ అనుమతులు పొందాలి? అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? వడ్డీ వ్యాపారుల ఆగడాల బాధితులు ఎవరిని సంప్రదించాలి? మరోవైపు అసలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఏ వృత్తుల వారికి అధికంగా రుణాలిస్తున్నాయి? ప్రైవేట్ అప్పుల ఊబి నుంచి పేదలను బయటపడేసే మార్గం ఏమిటి? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">