ETV Bharat / opinion

లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీలు మారుతున్న నేతలు - అధికారం లేనిదే రాజకీయాల్లో మనలేని పరిస్థితి ఎందుకు? - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Prathidhwani Debate On Leaders Migration : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ నాయకులు పార్టీలు మారుతున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీ నుంచి నేతలు హస్తం పార్టీ, బీజేపీలోకి చేరుతున్నారు. మరి ఇంత భారీస్థాయిలో నాయకులు పార్టీలు మారడానికి కారణమేంటి? అధికారం లేనిదే రాజకీయాల్లో మనలేని పరిస్థితి ఎందుకు? ఇదే అంశంపై ప్రతిధ్వని.

leaders Migration in Telangana
leaders Migration in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 10:32 AM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Prathidhwani Debate On Leaders Migration : లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో రాజకీయ నేతలు పార్టీలు మారుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌, బీజేపీలో అధిక సంఖ్యలో చేరుతున్నారు. అసలు ఇంత భారీస్థాయిలో నాయకులు పార్టీలు మారడానికి కారణమేంటి?ఈ వలసలు ఇంతటితో ఆగుతాయా, మరింత పెరుగుతాయా? ఎన్నికలపై వలసలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి గులాబీ పార్టీలోకి వలసలు. ఇప్పుడు భారత్‌ రాష్ట్ర సమితి నుంచి హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.అధికారం లేనిదే రాజకీయాల్లో మనలేని పరిస్థితి ఎందుకు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బలు : పార్లమెంట్ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు అవకాశం రాదని నిర్ణయించుకున్న సిట్టింగ్ ఎంపీలు, సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారు. ఎంపీలు రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. మరో ఎంపీ పోతుగంటి రాములు కమలం పార్టీలో చేరారు. తాజాగా గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కూడా షాక్‌ ఇచ్చారు. ఆయన తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మితో కలిసి హస్తం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

BRS Leaders Join to Congress and BJP : అదేవిధంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో మంతనాలు జరిపిన హస్తం పార్టీ నేతలు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్‌ ఇప్పించేలా హామీ ఇచ్చారు. ఈ పరిణామాలతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇటు పార్టీ నేతలను, అటు శ్రేణులను కాపాడుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ రూపొందిస్తోంది.

నాయకులు పార్టీ మారడంపై ఆందోళన చెందకుండా శ్రేణులను కాపాడుకోవడం, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడుతున్న వారి గురించి ఎక్కువగా ఆలోచించరాదన్న భావనలో గులాబీ పార్టీ నాయకత్వం కనిపిస్తోంది. ఇప్పుడు వెళ్లేవారు భవిష్యత్‌లో వెనక్కి వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదంటూ కార్యకర్తల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.