Prathidhwani Debate on Gaganyaan Mission : గగన్‌యాన్ ముఖ్య ఘట్టాలు ఒక్కొక్కటే కొలిక్కి తెస్తోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. ప్రాజెక్టులో కీలకమైన టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్- టీవీ-డీ1 వాహకనౌక పరీక్ష ఇప్పటికే విజయవంతం చేసింది ఇస్రో. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లు స్వయంగా ప్రకటించారు ప్రధాని మోదీ.
Gaganyaan Mission Astronauts : భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఇస్రో ఇంకా అధిగమించాల్సిన దశలు, సవాళ్లేంటి? గగన్‌యాన్ మిషన్‌తో దేశానికి, మానవాళికి ఏంటి ప్రయోజనం? ఇస్రో ఈ మిషన్‌ను ఎందుకింత పట్టుదలగా తీసుకుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరోవైపు గగన్‌యాన్ ప్రయోగంలో పాల్గొనేందుకు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, శుభాన్షు శుక్లా, అజిత్ కృష్ణన్, అంగడ్ ప్రతాప్‌కు శిక్షణ కొనసాగుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లనున్నారు. ఒకటి నుంచి మూడు రోజులపాటు వారిని అక్కడే ఉంచి తిరిగి భూమి మీదకు తీసుకురానున్నారు. కక్ష్యలోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చే క్రమంలో సముద్ర జలాల్లో ల్యాండ్ చేస్తారు.