Prathidhwani Debate on Fake Medicines : జబ్బులొస్తే తగ్గడానికి ఔషధాలు వాడుతాం. కానీ ఆ మందులే కొత్త సమస్యకు కారణమైతే అంతకంటే ప్రమాదకర పరిస్థితి ఇంకేముంటుంది. నకిలీ, నాసిరకం టాబ్లెట్లు, సిరప్‌లు, ఇంజెక్షన్లు ప్రజల్లో ఆందోళనకు కారణవుతున్నాయి. జ్వరం, జలుబు వంటి చిన్నచిన్న వాటికైతే వైద్యులను సంప్రదించకుండానే నేరుగా మెడికల్ షాపుల్లో ఎంతో నమ్మకంగా మందులు కొనేస్తున్నారు. వైద్యుల సిఫార్సు లేకుండానే మెడిసిన్స్ కొంటున్న 90 శాతం మంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Fake Medicines in Telangana : కానీ రాష్ట్రంలో ఇటీవల ఔషధ నియంత్రణశాఖ వరుస దాడుల్లో నకిలీ, నాసిరకం మందులు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ల పేరుతోనూ మార్కెట్లో చెలామణి అవుతున్నట్లు సోదాల్లో తేలింది. మాత్రల్లో సుద్ద, సిరప్‌లో చక్కెర నీళ్లు, ఇంజెక్షన్‌లో డిస్టిల్డ్ వాటర్ ఉన్నాయని అధికారులు గుర్తించారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లో చెలామణి అవుతున్నట్లు నిర్ధారించారు.
బ్లడ్ బ్యాంకుల్లోనూ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. అసలు ఈ నకిలీ ఔషధాలు ఎవరు తయారు చేస్తున్నారు? ప్రజల చేతుల్లోకి చేరే వరకూ ఎందుకు నియంత్రించలేక పోతున్నారు? నకిలీ ఔషధాలతో ప్రజాఆరోగ్యంపై పడే దుష్ప్రభావమెంత? ఔషధ నియంత్రణ సిబ్బంది, ల్యాబోరేటరీలు సరిపడా ఉన్నాయా? నకిలీ మందుల తయారీదార్లకు శిక్షలు పడుతున్నాయా? మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.