ETV Bharat / opinion

రాహుల్​ టు కుమారస్వామి- ఎన్నికల బరిలో PM, CM కుటుంబాలు - lok sabha election 2024

Political Families In Lok Sabha Election 2024 : లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధానులు, మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, కుమార్తెలు, సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులు 30 మందికిపైగా వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు నలుగురు ఉండగా, మాజీ సీఎంల కుటుంబ సభ్యులు 30 మంది వరకు ఉన్నారు. మాజీ సీఎంల కుటుంబ సభ్యుల్లో 12 మంది బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా, 10 మంది కాంగ్రెస్‌ నుంచి, 9 మంది వివిధ ప్రాంతీయ పార్టీల నుంచి రంగంలోకి దిగారు.

LOK SABHA ELECTION 2024
LOK SABHA ELECTION 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 3:11 PM IST

Political Families In Lok Sabha Election 2024 : లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న మాజీ ప్రధానుల కుటుంబ సభ్యుల్లో ఇద్దరు గాంధీ పరివారానికి సంబంధించినవారే. ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ బీజేపీ తరఫున పీలీభీత్‌ నుంచి బరిలోకి దిగారు. గతంలో ఆరుసార్లు, సుల్తాన్‌పుర్‌ నుంచి ఒకసారి పీలీభీత్‌ నుంచి ఆమె గెలుపొందారు. జనతాదళ్‌ నుంచి రెండు సార్లు, ఇండిపెండెంట్‌గా రెండు సార్లు, బీజేపీ తరఫున మూడు సార్లు ఆమె లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1989 నుంచి వరుసగా ఆమె గెలుస్తూ వస్తున్నారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ కుమారుడైన రాహుల్‌ గాంధీ 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి గెలుపొందారు. 2019లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేఠీలో రాహుల్‌ ఓడిపోయారు. అక్కడ ఓటమిని ముందే పసిగట్టిన ఆయన అదే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. రాహుల్‌ మళ్లీ వయనాడ్‌ నుంచి నామినేషన్‌ వేశారు. అమేఠీ నుంచి పోటీ చేస్తారా? లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

మండ్య నుంచి బరిలోకి కుమారస్వామి
మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడైన నీరజ్‌ శేఖర్‌ 2007 నుంచి లోక్‌సభ, రాజ్యసభల్లో ఏదో ఒక దానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ప్రస్తుతం బీజేపీ తరఫున బలియా నుంచి పోటీ పడుతున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు కుమారస్వామి 1996లో కనకపుర నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1998లో మళ్లీ అక్కడి నుంచే పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. 2009లో బెంగుళూరు రూరల్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు తన ఒక్కలిగ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న మండ్య నుంచి ఎన్​డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఆయన కుమారుడు నిఖిల్‌ కుమార స్వామి పోటీచేసి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన సినీ నటి సుమలత చేతిలో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో సుమలతకు బీజేపీ మద్దతివ్వడం వల్ల జేడీఎస్‌ ఓటమిపాలైంది. పొత్తులో భాగంగా ఇప్పుడు జేడీఎస్‌కు మండ్య స్థానాన్ని బీజేపీ కేటాయించింది. బీజేపీలో చేరిన సుమలత, కుమారస్వామికి మద్దతు ఇస్తున్నారు.

మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్న లాలూ కుమార్తెలు
మాజీ సీఎంల కుటుంబ సభ్యుల విషయానికి వస్తే దిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్‌ కుమార్తె భాంసురీ స్వరాజ్‌, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల, లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణీ ఆచార్య, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ కుమారుడు వీరేంద్ర రావత్‌ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. భాంసురీ స్వరాజ్‌ కొత్త దిల్లీ నుంచి, వైఎస్‌ షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్నారు. తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ దానంచేసి ప్రాణం నిలబెట్టి ఆయన అసలైన వారసురాలిగా గుర్తింపు పొందిన రోహిణీ ఆచార్య ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం సారణ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీతో తలపడుతున్నారు. ఈ స్థానం నుంచి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అన్నే సార్లు గెలిచిన రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ ఇప్పుడు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లాలూ మరో కుమార్తె, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న మీసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గంలో ఐదుసార్లు ఎంపీగా గెలిచిన రామ్‌ కృపాల్‌ యాదవ్‌తో తలపడుతున్నారు. రామ్‌ కృపాల్‌ ఒకప్పుడు ఆర్​జేడీ సభ్యుడే. ఆ పార్టీ నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో లాలూ ప్రసాద్‌ ఆ స్థానాన్ని కుమార్తె మీసా భారతికి కేటాయించడం వల్ల ఆయన బీజేపీలో చేరి గెలిచారు. 2019లో మీసా భారతిపై రామ్‌ కృపాలే పైచేయి సాధించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు.

సీఎంల కుమారులు ఎంపీలుగా బరిలోకి
మాజీ సీఎం ప్రేమ్‌సింగ్‌ కుమారుడు కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌ నుంచి బరిలో ఉన్నారు. మాజీ సీఎం SR బొమ్మై కుమారుడు, ఇప్పటికే సీఎంగా పని చేసిన బసవరాజ్‌ బొమ్మై బీజేపీ తరఫున కర్ణాటకలోని హవేరి నుంచి పోటీ చేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలిచి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేసి, తర్వాత బీజేపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్​టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తున్నారు. ఆరు సార్లు కటక్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఒడిశా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మెహతాబ్‌ కుమారుడు భర్తృహరి మెహతాబ్‌ బీజేపీ నుంచి కటక్‌ బరిలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ కొడుకు నకుల్‌నాథ్‌ కాంగ్రెస్‌ తరఫున ఛింద్వాడా నుంచి బరిలోకి దిగారు. రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌ రాజస్థాన్‌లోని ఝాలోర్‌-సిరోహీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ భార్య ప్రణీత కౌర్‌ బీజేపీ తరఫున పటియాలా బరిలో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌ కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌ కమలదళం నుంచి ఎటావాలో పోటీ చేస్తున్నారు.

తండ్రి వర్సెస్ కొడుకు
దేశంలోనే 29 ఏళ్ల అత్యంత పిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా పని చేసిన అగాథా సంగ్మా ఈ ఎన్నికల్లో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ NPP తరఫున మేఘాలయలో తుర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం పీఏ సంగ్మా కుమార్తె అగాథా సంగ్మా. కర్ణాటకలోని శివమొగ్గలో అయితే ఇద్దరు మాజీ సీఎంల వారసులు పోటీలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్రతో అదే రాష్ర్టానికి చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌. బంగారప్ప తనయ, కాంగ్రెస్‌ అభ్యర్థి గీతా శివరాజ్‌ కుమార్‌ తలపడుతున్నారు. రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే తనయుడు దుశ్యంత్‌ సింగ్‌ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. రాజస్థాన్‌లోని ఝాలావాడ్‌-బారా నియోజకవర్గం నుంచి దుశ్యంత్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కేరళలోని పథనంథిట్ట స్థానం నుంచి ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీ తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే తన కుమారుడు అనీల్‌ ఓడిపోవాలని ఏకే అంటోనీ కోరుకోవడం గమనార్హం. మహారాష్ర్ట సోలాపుర్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఆ రాష్ర్ట మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ తనయ ప్రణీతి శిందేను కాంగ్రెస్‌ బరిలో నిలిపింది. NCP శరద్‌ పవార్ వర్గం నుంచి మహారాష్ర్ట మాజీ సీఎం శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే బారామతి నుంచి పోటీ చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా సుప్రియా సూలే వినూత్నంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మైన్‌పురీ నుంచి మరోసారి డింపుల్​ యాదవ్​
కేరళ మాజీ సీఎం కె. కరుణాకరన్‌ కుమారుడు కె. మురళీధరన్‌ త్రిశ్శూర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. అసోంలోని జోర్హట్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన గౌరవ్‌ గొగొయ్‌ తండ్రి తరుణ్‌ గొగొయ్‌ ఆ రాష్ట్రానికి దాదాపు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురీ నుంచి సమాజ్‌ వాదీ పార్టీ తరఫున ఆ రాష్ర్ట మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్ భార్య డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. 1996 నుంచి సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా ఉన్న మైన్‌పురీలో గెలుపుపై డింపుల్‌ యాదవ్‌ మరోసారి ధీమాగా ఉన్నారు. 2022లో జరిగిన ఉపఎన్నికల్లో డింపుల్‌ యాదవ్‌ గెలుపొందారు. తమిళనాడు తూత్తుకుడి స్థానం నుంచి డీఎంకే తరఫున ఆ రాష్ర్ట మాజీ సీఎం ఎం.కరుణానిధి కుమార్తె కనిమొళి బరిలోకి దిగారు. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ముఫ్తీ మహమ్ముద్‌ తనయ మెహబూబా ముఫ్తీ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అనంత్‌నాగ్‌ నుంచి PDP పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ తరఫున జమ్మూకశ్మీర్‌ మరో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తనయుడు ఒమర్‌ అబ్దుల్లా బారాముల్లా నుంచి బరిలో నిలిచారు. హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నారు. మండి నియోజకవర్గంలో బరిలో నిలిచిన విక్రమాదిత్య బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రనౌత్‌తో తలపడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేవెగౌడ ఫ్యామిలీ పాలిటిక్స్​- ఒకే కుటుంబం నుంచి బరిలో 9మంది- ఎక్కడ చూసినా వాళ్లే! - Devegowda Family In Politics

పీలీభీత్‌పైనే అందరి ఫోకస్- గాంధీల్లేకుండా 30ఏళ్లలో తొలిసారి పోరు- జితిన్ ప్రసాద గెలుస్తారా? - Pilibhit Lok Sabha Gandhi Family

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.