Pratidhwani : కొత్తబంగారు లోకంలో విహరించాల్సిన బంగారు బాల్యం. మత్తుపంజరంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. పదేళ్ళ ప్రాయం నుంచి అంటుకుంటున్న మత్తు అలవాట్లు కన్నవారి కలలను కళ్లముందే కూల్చేస్తున్నాయి. ఒక్కరో ఇద్దరో కాదు. వేలాదిమంది నుంచి ఇప్పుడా సంఖ్య లక్షలకి చేరుతోంది. తల్లిదండ్రులకు తీరని వ్యథ మిగిల్చుతోంది. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న చాపకింద నీరులా విస్తరిస్తునే ఉందీ మాఫియా. ఎన్నో విధాల అనర్థాలకు కూడా కారణం అవుతోంది. ఫలితంగానే టీనేజీ దాటకముందే చేతుల్లో సిగరెట్లు, గంజాయి, ఇతర మత్తుపదార్థాల వినియోగం ఇప్పుడో కొత్త సామాజిక సమస్యగా, సంక్షోభంగా మారుతోంది. మరి ఈ విషయంలో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ అర్చన నండూరి, బాలల హక్కుల కార్యకర్త హరి వెంకట రమణ పాల్గొన్నారు.
నాతో చేతులు కలపండి - ప్రభుత్వ సంకల్పంలో భాగం అవ్వండి: యువతకు 'దేవర' పిలుపు - NTR on Drugs Awareness
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మహమ్మారి : ఇటీవల జరుగుతున్న నేరాల ఘటనల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక మంది యువకులు, మైనర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న మార్పు రావడం లేదు. ఇటీవల కాలంలో పిల్లలపై పర్యవేక్షణ తగ్గిపోతోంది. కొందరు తల్లిదండ్రులు అతిప్రేమ చూపిస్తున్నారు. కార్లు. బైక్లు, ఖరీదైన సెల్ఫోన్లు కొని పెడుతున్నారు. పిల్లల పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేశారు. వారేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్నారు. గతంలో బాలలు, యువకులు ఏ చిన్న తప్పు చేసినా వారిని మందలించేవారు.
మత్తు పదార్థాలకు అడ్డాగా పబ్బులు- వరుస దాడులతో హడలెత్తిస్తున్న న్యాబ్ - TG NAB POLICE RAIDS IN PUBS
నిషా ముక్త భారత్ పేరిట యుద్ధమే : ఆ తప్పులు మళ్లీ జరగకుండా యువకులను పోలీసులు హెచ్చరించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. తప్పులు చేస్తున్నా యువకులను కొందరు వెనుకేసుకొస్తున్నారు. దీంతో తామేం చేసినా తల్లిదండ్రులు ఏమీ అనరన్న భావన వారిలో కలుగుతోంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో చెడును ఎక్కువగా అనుసరిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతూ అప్పులు చేస్తున్నారు. మద్యం, గంజాయి తీసుకుంటూ ఆ మత్తులో విచక్షణ కోల్పోయి గొడవలు, పలు రకాల నేరాలకు సైతం పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.