ETV Bharat / opinion

సార్వత్రిక సమరం 2024లో 'ఎన్డీఏ వర్సెస్ ఇండియా' - ఎవరిది పైచేయి? - ఇండియా కూటమి

Etv Bharath Pratidhwani: సార్వత్రిక ఎన్నికలకు అధికార, విపక్షకూటములు సమరశంఖం పూరించాయి. జనవిశ్వాస్ పేరుతో ఇండియా కూటమి, విజయసంకల్ప సభలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉధృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి? మోడీ సర్కార్‌ హ్యాట్రిక్ కొడుతుందా? ఇండియా కూటమి ఐక్యపోరాటం ఫలిస్తుందా? 'సార్వత్రిక సమరం - 2024' ప్రతిధ్వని కార్యక్రమంలో కేయూ సహాయ ఆచార్యులు తిరుణహరి శేషు, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందె సత్యం పాల్గొన్నారు.

Etv Bharath Pratidhwani on  Indian general election 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 11:39 AM IST

Updated : Mar 5, 2024, 11:44 AM IST

Etv Bharath Prathidwani : సార్వత్రిక ఎన్నికలకు అధికార, విపక్షకూటములు సమరశంఖం పూరించాయి. జనవిశ్వాస్ పేరుతో 'ఇండియా కూటమి (INDIA Alliance)', విజయసంకల్ప సభలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఉధృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి? మోడీ సర్కార్‌ హ్యాట్రిక్ కొడుతుందా? ఇండియా కూటమి ఐక్యపోరాటం ఫలిస్తుందా? ఏఏ రాష్ట్రాలు ఎవరెవరికి అనుకూలంగా ఉన్నాయి? ఇరుపక్షాల బలాబలాటేంటి? దీనిపై విశ్లేషణ చేయటానికి ఇరువురు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. 'సార్వత్రిక సమరం - 2024' ప్రతిధ్వని కార్యక్రమంలో కేయూ సహాయ ఆచార్యులు తిరుణహరి శేషు, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందె సత్యం పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రతి పోలింగ్​ బూత్​లో బ్రీత్​ ఎనలైజర్లు ఏర్పాటు కోరుతూ - హైకోర్టులో పిల్​ దాఖలు

ప్రశ్న : ఈసారి లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలను ప్రధానంగా ఏఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి?
జవాబు : ఆచార్యులు తిరుణహరి శేషు మాట్లాడుతూ, "ప్రభుత్వం వైపు నుంచి రామ మందిరం, వికసిత్ భారత్, మోదీ చరిష్మా ఈ మూడు అంశాల ఆధారంగా తమ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, పార్టీకి ఒక పాజిటివ్ వేవ్ అని బీజేపీ నేతలు ఆశావాద దృక్పథంతో ఉన్నారు" అని తెలిపారు.

అలాగే "దేశంలో దీర్ఘకాలిక ఉన్నటువంటి సమస్యలను రాజకీయ అజెడాగా మార్చి ఎన్నికల్లో జయపజయాలను ప్రభావితం చేయాలని విపక్ష కూటమి చూస్తోంది. దీర్ఘకాలిక సమస్యలు అయినటువంటి ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, ప్రైవేటీకరణ జరగడం, కార్పొరేట్ శక్తులను విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దేశంలో పెరుగుతున్న అసమానతలు, మణిపూర్ జరుగుతున్న అల్లర్లు ఇవ్వని రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది." అని అన్నారు.

బీజేపీ ఆపరేషన్ 'క్లీన్అప్'- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 33మందికి నో టికెట్​

ప్రశ్న : కూటములు పరంగా చూసుకుంటే ఎన్డీఏ, ఇండియా ఈ రెండు కూటముల్లో ఉన్న పార్టీల బలాబలాలేంటి?

జవాబు : డాక్టర్ అందె సత్యం మాట్లాడుతూ, ఎన్​డీఏ కూటమిలో మోదీ, నితీష్ కుమార్​ల పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు తప్ప పెద్దగా బలంగా ఉన్న పార్టీల లేవు. ఈ దేశానికి ప్రాంతీయ పార్టీలు అనవసం లేదు అనే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది. నితీష్ కుమార్ అటు ఇటు తిరిగి చివరికి ఎన్డీఏ చేరారు. ఇండియా కూటమిలో 28 పార్టీలు చేరాయి. ఇండియా కూటమి పార్టీలు ఆయా రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్నాయి.

Lok Sabha Election 2024 : ఇలా మోదీ ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతున్న అంశాలు ప్రధానంగా ఏంటి? అవి ఎంతవరకు ప్రజలను ఆకర్షిస్తున్నాయి? ఇండియా కూటమికి మోడీని ఓడించటమే ఎజెండానా? లేక కామన్ ఎజెండాతో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటారా? అది ఎంతవరకు సఫలీకృతం కావచ్చు? వివిధ అంశాల గురించి నేటి ప్రతిధ్వనిలో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం!

బీజేపీతో ఆర్​ఎల్​డీ దోస్తీ- ఎన్​డీఏ కూటమితో ఎన్నికల బరిలోకి!

Last Updated : Mar 5, 2024, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.