ETV Bharat / opinion

టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది - వైఎస్సార్సీపీ జడిసింది! - టీడీపీ జనసేన అభ్యర్థులు

Pratidhwani: తెలుగుదేశం-జనసేన అధినేతలు ఎన్నికల శంఖారావం పూరించారు. పొత్తు విచ్ఛిన్నానికి అధికార వైఎస్సార్సీపీ ఎత్తుగడలను తిప్పికొడుతూ టీడీపీ - జనసేన కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితా ప్రకటించారు. విపక్షాల ఐక్యతతో తాడేపల్లి లెక్కలు తలకిందులవుతున్నాయి. 'కలిసిన విపక్షం - కలవరంలో అధికారపక్షం' అనే అంశంపై ప్రతిధ్వనిలో చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు కె.గౌతమ్, సీనియర్ జర్నలిస్ట్ పి.విక్రమ్ పాల్గొన్నారు.

TDP-Janasena First List for AP Elections-2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 12:56 PM IST

Pratidhwani : తెలుగుదేశం - జనసేన కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితా విడుదలైంది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంలో పేచీ వస్తుందని, పొత్తు నీరుకారుతుందని భావించిన అధికార వైఎస్సార్సీపీకి చుక్కెదురైంది. విపక్షాలు చేతులు కలపకుండా చేయాలని తెరముందు, తెరవెనుక అధికార పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి. ఓట్ల చీలికతో లాభపడవచ్చన్న ఆశలు గల్లంతయ్యాయి. టీడీపీ - జనసేన కలయికపై వైఎస్సార్సీపీ ఎందుకు కలవరంతో ఉంది? విపక్ష కూటమి ఏ విధంగా దీనివల్ల బలోపేతం అవుతోంది? ఇది వైఎస్సార్సీపీకి ఏ విధంగా నష్టం కలిగిస్తుంది? 'కలిసిన విపక్షం - కలవరంలో అధికారపక్షం' అనే అంశంపై ప్రతిధ్వని చర్చ. రాజకీయ విశ్లేషకులు కె.గౌతమ్, సీనియర్ జర్నలిస్ట్ పి.విక్రమ్ చర్చలో పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

TDP-Janasena First List for AP Elections-2024 : తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల జాబితాలో వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. 99 మంది అభ్యర్థుల్లో 18మంది బీసీలు ఉన్నారు. ఇఛ్చాపురం, టెక్కలి, అమదాలవలస, గజపతినగరం, విశాఖ పశ్చిమం, నర్సీపట్నం, తుని, రాజమహేంద్రవరం సిటీ, ఆచంట, నూజివీడు,పెడన, మచిలీపట్నం, రేపల్లె, మైదుకూరు, పత్తికొండ, రాయదుర్గం,పెనుకొండ, అనకాపల్లి స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు 17 మందికాగా జనసేన నుంచి మాజీ మంత్రి కొణతల రామకృష్ణ ఉన్నారు.

వెనకబడిన వర్గాలకే టీడీపీ-జనసేన తొలి జాబితాలో పెద్దపీట

రాష్ట్రంలో మొత్తం 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుండగా తొలి జాబితాలోనే 20 మందిని ప్రకటించారు. ఆ 20 మంది తెలుగుదేశం పార్టీ వారే. వీరిలో 10మంది మొదటి సారి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. వారిలో పి.గన్నవరం నుంచి మహాసేన రాజేష్‌, తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు సామాజిక కార్యకర్తలు. జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో పోరాడుతున్నారు.

ఒక్క కుటుంబంలో ఒక్కరికే టికెట్ ​: తెలుగుదేశం తరఫున పోటీచేసే వారిలో పలువురు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాల నుంచి వచ్చారు. వీరిలో కొంత మంది తొలిసారి పోటీలో దిగుతుండగా మరికొంత మందికి గతంలో పోటీచేసిన అనుభవం ఉంది. ఒక్క కుటుంబానికి ఒక టికెట్‌ మాత్రమే ఇవ్వాలన్న విధాన నిర్ణయానికి కట్టుబడి కొంతమంది నాయకుల కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు టికెట్లు ఆశించినా ఒకరికే పరిమితం చేసింది.

వైఎస్సార్సీపీ కంచుకోటల్లో ఎదురుగాలి - అయోమయంలో నేతలు

కోట్ల కుటుంబంలో సూర్యప్రకాశ్‌ రెడ్డికి డోన్, కేఈ కుటుంబంలో శ్యాంబాబుకు పత్తికొండ, పరిటాల కుటుంబంలో సునీతకు రాప్తాడు, భూమా కుటుంబంలో అఖిలప్రియకు ఆళ్లగడ్డ నియోజకవర్గాలను కేటాయించింది. ఈ కుటుంబాల నుంచి వీరితో పాటు ఇతరులు కూడా టికెట్లు ఆశించినా, అధిష్ఠానం ఒక్కరికే అవకాశం ఇచ్చింది.

ఉభయగోదావరి జిల్లాలపైనే జనసేన ఫోకస్​ - భీమవరం నుంచే పవన్​ !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.