Drug Control Action Plan in Telangana : మాదకద్రవ్యాల మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వం, పోలీసులతో పాటు ప్రతిఒక్కరి భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణలో భాగం కావాలని సినీ పరిశ్రమ కూడా కలసిరావాలని పిలుపునిచ్చారు. గల్లీ గల్లీలో దొరుకుతున్న గంజాయిని అరికట్టాలని, మత్తు ముఠాలు భయపడేలా చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) కు దిశానిర్దేశం చేశారు సీఎం.
సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలకు మూలంగా నిలుస్తోన్న మాఫియాను కూకటివేళ్లతో పెకళించాలనేది ఎంతో కాలంగా ఉన్న లక్ష్యమే. కానీ ఆ దిశగా ఎందుకు ఆశించిన ఫలితాలు సాధించలేక పోతున్నాం? ఆ వైఫల్యం కారణంగా చిన్నారుల, యువత పై ఎలాంటి దుష్ప్రభావాలు పడుతున్నాయి.? డ్రగ్స్ రహిత తెలంగాణనే అందరి పంతం కావాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం ఆ విషయంలో అసలు ఎక్కడున్నాం? ఇప్పుడేం జరగాలి?
డ్రగ్స్ కట్టడిపై మరీ ముఖ్యంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి బలంగా కోరుకోవడానికి కారణమేంటి? రోజురోజుకీ వేళ్లూనుకు పోతోన్న డ్రగ్స్‌భూతం సమాజంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతోంది ? ముఖ్యంగా డ్రగ్స్ బారిన పడుతోన్న యువత, చిన్నారుల పరిస్థితేంటి? డ్రగ్స్ వినియోగం అనేది వ్యక్తిగత సమస్యల స్థాయి దాటి సామాజిక సంక్షోభంగా మారడం మొదలై చాలా కాలమైంది. ఆ తీవ్రతను ప్రజలకు తెలియజేయడం ఎలా? లేకుంటే ఏం జరుగుతుంది?
ముఖ్యంగా పాఠశాలలు, విద్యాసంస్థల్లో గంజాయి, మత్తుపదార్థాల నీడ పడకుండా చేయడానికి ఎలాంటి సమగ్ర కార్యాచరణ అవసరం? పోలీసులతో పాటు ప్రజల పాత్ర ఏమిటి అందులో? ప్రస్తుతం ఉన్న టీజీ-న్యాబ్ బలోపేతంతో పాటు డ్రగ్స్ రహిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి. మత్తుపదార్థాల బారిన పడిన వారిని ఆ వ్యసనం నుంచి విముక్తి చేయడానిసి అవసరమైన డీ అడిక్షన్, రిహాబిలిటేషన్ అంశాల్లో ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంది? డ్రగ్స్ విషయంలో ఇప్పుడు అందరిపై ఉన్న బాధ్యత ఏమిటి? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్న యువత - అడ్డుకోవడం ఎలా? - Prathidwani Debate on Drugs