ETV Bharat / opinion

ప్రతిపక్షంలో మాటలతోనే కడుపు నింపిన జగన్ - అధికారం చేపట్టాక మొండిచేయి చూపారు - CM Jagan Promises to Dwcra - CM JAGAN PROMISES TO DWCRA

Etv Bharat Pratidwani: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ తనను సీఎం చేస్తే మహిళలను లక్షాధికారులను చేస్తానని ఆశ పెడుతూ జగన్ చెప్పిందేంటీ? చివరకు చేసిందేంటీ? "డ్వాక్రాలకు టోకరా!" అనే అంశంపై ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, సామాజిక ఉ‌ద్యమకారిణి బి.వందనాదేవి పాల్గొన్నారు.

Etv Bharat Pratidwani
Etv Bharat Pratidwani
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 10:38 AM IST

Etv Bharat Pratidwani : అరచేతిలో స్వర్గం చూపించడమంటే ఏంటో తెలుసా? మాటలతో కడుపు నింపడం గురించి విన్నారా? సాయం చేయకుండా చేసినట్లు చూపించడం, కోత పెట్టిన గాటు కనిపించకుండా చేయడం, ఉన్న డబ్బులు మాయం చేయడం, లేనిది ఉన్నట్టు చూపడం ఇవ్వన్ని ఇంద్రజాలికుల మ్యాజిక్కులు కానే కాదు. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ డ్వాక్రా మహిళల విషయంలో చేస్తున్న జిమ్మిక్కులు. మహిళా సాధికారత అంటూ వారికి ఎలా టోకరా వేస్తున్నారో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ తమను సీఎం చేస్తే మహిళలను లక్షాధికారులను చేస్తానని ఆశా పెడుతూ జగన్ చెప్పిందేంటీ? చివరకు చేసిందేంటీ? "డ్వాక్రాలకు టోకరా!" అనే అంశంపై ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, సామాజిక ఉ‌ద్యమకారిణి బి.వందనాదేవి పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహిళా సంఘాల స్వయం ఉపాధిపై జగన్‌ దెబ్బ- ప్రగతిని పాతాళానికి తొక్కిన వైసీపీ సర్కార్ - YCP Betrayed Dwakra Womens

YSRCP Government Betrayed Dwakra Women Groups : ఎన్నికల ముందు సీఎం జగన్​ అన్న మాట ఒక్క ఛాన్స్‌. ఈ అవకాశమే డ్వాక్రా సంఘాల ప్రగతిని పాతాళానికి నెట్టింది. పొదుపు, స్వయం ఉపాధిలో కోటి మంది సభ్యులతో ఆదర్శంగా నిలిచిన మహిళా సంఘాలకు తీరని ద్రోహం చేసింది. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఏకంగా 7500 మంది డ్వాక్రా మహిళలను రోడ్డున పడేశారు. పెళ్లి కానుక పథకాన్ని అమలు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం 2500 మంది కల్యాణ మిత్రలను, చంద్రన్న బీమా పథకం అమలుకు 2వేల మంది బీమా మిత్రలను, పశువుల పెంపకంలో రైతులకు చేయూతగా నిలిచేందుకు 3వేల మంది పశు మిత్రలను డ్వాక్రా మహిళల నుంచే నియమించింది. వీరంతా నెలకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించేవారు. అప్పట్లో వీరు ప్రతి పథకాన్నిలబ్ధిదారులకు చేరువ చేశారు. ఇలాంటి వారిని మరింత ప్రోత్సహించాల్సింది పోయి విధుల్లో నుంచే తీసేశారు.

సీఎం సభకు రావాల్సిందే - డ్వాక్రా మహిళలపై అధికారుల ఒత్తిడి

ఉన్నతి పథకం కింద టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు చక్కటి ఆదరవు దక్కేది. మహిళల స్వయం ఉపాధికి చేయూత నివ్వడానికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం వీరికి రూ.800 కోట్లను వడ్డీ లేకుండా రుణాలుగా ఇచ్చింది. అప్పును నెలవారీ వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడంలో తనను మించిన వారే లేరన్నట్లు గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్ ఈ ఐదు సంవత్సరాలలో ఉన్నతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

గత ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తాన్నే రొటేషన్‌ చేసుకుంటూ కాలాన్ని నెట్టుకొచ్చారు. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 59 ఏళ్లు నిండిన మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్లు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అభయ హస్తం పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి అర్హతలున్న మహిళలు ఏటా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. పింఛను చెల్లించేందుకు ప్రభుత్వం ఎల్​ఐసీతో ఒప్పందం చేసుకుంది. దరఖాస్తుదారుల వాటా, ప్రభుత్వ వాటా కలిపి 2 వేల కోట్ల వరకు చేరింది. ఈ నిధిపై కన్నేసిన అభినవ అప్పుల అప్పారావు జగన్‌ ఎల్‌ఐసీని పథకం నుంచి తప్పించి ఆ మొత్తాన్ని తీసేసుకున్నారు. రెండు వేల కోట్లను ఏం చేశారో ఎటు మళ్లించారో కూడా తెలియడం లేదు.

మీరే పెట్టుబడి పెట్టండి, మీరే కొనుక్కోండి! -జగనన్న మార్క్ మార్ట్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.