Problems in Universities in Telangana : ఆలోచనల వికాసానికి ఆయువుపట్లు విశ్వవిద్యాలయాలు. సమాజగతిని నిర్దేశించే ఈ జ్ఞాన భాండాగారాలు కొన్నేళ్లుగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆచార్యుల నియామకాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ కొనసాగుతోంది. తగినంత బోధనేతర సిబ్బంది లేక పలు విభాగాల్లో పరిపాలన కుంటుపడుతోంది. గ్రాంట్లు, అభివృద్ధి నిధులు అందుబాటులో లేక విద్యా అధ్యయనం, పరిశోధనలు నత్తనడకన సాగుతున్నాయి.
కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. అసలు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి ఎందుకింత అగమ్యగోచరంగా తయారయ్యింది? కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ అధ్యాపకుల ప్రయోజనాలకు రక్షణ ఎలా లభిస్తుంది? మసకబారిన యూనివర్సిటీల ప్రతిష్ఠను మళ్లీ పునరుద్ధరించేది ఎలా? ఇదే నేటి ప్రతిధ్వని.