ETV Bharat / opinion

7ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ- 2016లో ఏం జరిగింది? OME శకలాలను ఎలా కనుగొంది? ఈటీవీ భారత్ ఎక్స్​క్లూజివ్

Bay Of Bengal Mystery IAF Craft : భార‌త వైమానిక ద‌ళానికి (ఐఏఎఫ్‌) చెందిన ఏఎన్‌-32 అనే ర‌వాణా విమాన అదృశ్య మిస్ట‌రీ ఏడేళ్ల తర్వాత ఇటీవలే వీడింది. 29 మందితో అదృశ్య‌మైన ఈ విమానానికి చెందిన శ‌క‌లాల‌ను నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) మిషన్ కనుగొంది. అయితే 2016లో ఏం జరిగింది? శకలాలను ఎలా కనుగొంది?

Bay Of Bengal Mystery IAF Craft
Bay Of Bengal Mystery IAF Craft
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 9:00 AM IST

Updated : Jan 23, 2024, 9:15 AM IST

Bay Of Bengal Mystery IAF Craft : చెన్నైకి చెందిన నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) చేపట్టిన మిషన్ ఒక విషాద సముద్ర రహస్యాన్ని ఇటీవలే ఛేదించింది. దాదాపు ఏడేళ్ల క్రితం 29 మందితో అదృశ్య‌మైన భార‌త వైమానిక ద‌ళానికి (ఐఏఎఫ్‌) చెందిన ఏఎన్‌-32 విమానానికి చెందిన శ‌క‌లాల‌ను చెన్నై తీరానికి 310 కిలోమీట‌ర్ల దూరంలో క‌నుగొంది. శకలాలను AUV(అటానమస్ అండర్ వాటర్ వెహికల్​) OME (ఓషన్ మినరల్ ఎక్స్‌ప్లోరర్) 6000 గుర్తించింది. అయితే అసలు ఏడేళ్ల క్రితం 2016లో ఏం జరిగింది? OME శకలాలను ఎలా కనుగొనింది?

Bay Of Bengal Mystery IAF Craft
NIOT అభివృద్ధి చేసిన AUV

2016లో ఏం జరిగిందంటే?
2016 జూలై 22 ఉదయం 8.30 ప్రాంతంలో IAF ఆంటోనోవ్ ఏఎన్​-32 విమానం చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరింది. మూడు గంటల తర్వాత అది గమ్యస్థానం అయిన అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌కు చేరాల్సి ఉంది. ఏఎన్-32 రకానికి చెందిన విమానాలు చాలా బరువుతో పాటు బలంతో ఉంటాయి. పర్వతాలు, ఎడారుల్లో ఈ ఫ్లైట్ అధికంగా సంచరిస్తుంది. వారానికోసారి పోర్ట్‌బ్లెయిర్‌కు ఈ రవాణా విమానం వెళ్లాల్సి ఉంది. ఆ రోజున సిబ్బందితో సహా మొత్తం 29 మంది బయల్దేరారు.

అయితే పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన INS ఉత్క్రోష్‌లో అది ల్యాండ్‌ కాలేదు. చెన్నైకి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో విమానం ఉన్న సమయంలో ఉదయం 9.15 గంటలకు రాడార్​తో సంబంధాలు తెగిపోయాయి. అయితే విమానం అదృశ్యమైన వార్త వ్యాప్తి చెందడం వల్ల బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబీకులు ఈ విషాదం నుంచి బయటపడతారని ఆశించారు.

Bay Of Bengal Mystery IAF Craft
NIOT అభివృద్ధి చేసిన AUV

బంగాళఖాతం మీదుగా వెళ్తుండగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు ధ్రువీకరించుకుని రంగంలోకి దిగారు. అదృశ్యమైన విమానం కోసం తీవ్రంగా గాలించారు. భారత వైమానిక దళం అణువణువు గాలించినా ఫలితం లేకపోవడం వల్ల సెప్టెంబర్‌లో బాధిత కుటుంబ సభ్యులకు విమానాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని, విమానంలో ఉన్నవారిని చనిపోయినట్లు భావించి ప్రకటించడం తప్ప వేరే మార్గం లేదని లేఖలు రాసింది. అలా విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చనని అధికారులు అప్పుడు భావించారు.

బంగాళాఖాతంలో తప్పిపోయిన విమానాన్ని గుర్తించడానికి, లోతైన సముద్ర అన్వేషణ కోసం ప్రారంభించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (ఏయూవీ) ఇటీవ‌ల ఈ విమానానికి సంబంధించిన శ‌క‌లాల ఫొటోల‌ను తీసింది. ఆ ఫొటోల‌ను బాగా విశ్లేషించిన త‌ర్వాత అది ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్‌-32 విమానానికి చెందిన శ‌క‌లాలుగా నిర్ధరించారు. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో కూలిపోయినట్లు గుర్తించారు.

శిథిలాలను OME 6000 ఎలా కనుగొంది?
NIOT చేపట్టిన మిషన్​లో భాగమైన శాస్త్రవేత్తలతో ఈటీవీ భారత్​ ప్రత్యేకంగా మాట్లాడింది. ఏఎన్‌-32 శిధిలాలను గుర్తించిన అటానమస్ అండర్ వాటర్ వెహికల్ OME-6000 విజువల్స్​ను పరిశీలించింది. ఈ OME పొడవు 6.6 మీటర్లు, వెడల్పు 0.875 మీటర్లతో ఉండగా రెండు టన్నుల బరువు కలిగి ఉన్నట్లు గుర్తించింది.

"సముద్రం కింద లభ్యమయ్యే ఖనిజాల అన్వేషణకు సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భాగంగా, NIOT అటానమస్ అండర్ వాటర్ వెహికల్‌ను అభివృద్ధి చేసింది. ఇది 6000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఆ సమయంలో 3,400 మీటర్ల లోతులో ఉన్న కొన్ని మానవ నిర్మిత వస్తువులను గుర్తించింది. వాటిని క్యాప్చర్ చేసి చిత్రాలను పంపించింది. వాటిపై అధ్యయనం చేసి ఏఎన్‌-32 శిధిలాలుగా గుర్తించాం" అని NIOT శాస్త్రవేత్త డాక్టర్ NR రమేశ్ తెలిపారు.

NIOT అభివృద్ధి చేసిన AUV
NIOT అభివృద్ధి చేసిన AUV వివరాలు

"దీంతో ఆ శిథిలాలపై మరింతగా అన్వేషించాలని NIOT నిర్ణయించింది. మరింత దగ్గరగా శకలాల వద్దకు వెళ్లి చిత్రాలను తీసి రక్షణ మంత్రిత్వ శాఖతో భారత వైమానికి దళానికి పంపాం. 2016 జులై 22లో అదృశ్యమైన విమాన శకలాలుగా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది" అని శాస్త్రవేత్త రమేశ్ చెప్పారు.

సజీవమైన, నిర్జీవమైన సముద్ర వనరుల అన్వేషణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో NIOT సంస్థ నిమగ్నమై ఉందని డైరెక్టర్ GA రామదాస్ తెలిపారు. "నిర్జీవ వనరుల అన్వేషణలో భాగంగా మేం 5000 మీటర్ల నీటి లోతు వరకు వెళ్లగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటివరకు NIOT మానవరహిత నౌకలను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ముగ్గురిని 6 కి.మీ లోతు వరకు తీసుకెళ్లగలిగేలా వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది" అని రామదాస్ చెప్పారు.

Bay Of Bengal Mystery IAF Craft
NIOT అభివృద్ధి చేసిన AUV

లోతైన సముద్ర అన్వేషణ ఆపరేషన్​లలో ఉపయోగించే అత్యాధునిక పరికరం అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ (AUV). ముందుగా ప్రోగ్రామ్ చేసిన రోబోలే AUVలు. నీటి అడుగున స్వయంప్రతిపత్తితో పనిచేస్తాయి. ప్రయోగానికి ముందు రూపొందించిన ప్రణాళిక ప్రకారం వనరులను అన్వేషిస్తాయి. హిందూ మహాసముద్రంలో పాలీమెటాలిక్ నోడ్యూల్స్, హైడ్రోథర్మల్ సల్ఫైట్‌లతోపాటు బంగాళాఖాతంలో గ్యాస్ హైడ్రేట్‌లను అన్వేషించడానికి NIOT ఇటీవల రూపొందించింది.

Last Updated : Jan 23, 2024, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.