ETV Bharat / opinion

విపక్షాలపై బీజేపీ 'రామబాణం'- ఎన్నికల్లో అయోధ్య రామాలయం ప్రభావం చూపుతుందా? - Ram Temple impact On Elections

Ram Temple impact On Elections 2024 : అయోధ్య రామమందిరం సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నిర్మాణం కోసం బీజేపీ కోసం ఉద్యమించింది బీజేపీనే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన నుంచి బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వరకూ ప్రధాని మోదీ చేతుల మీదుగానే సాఫీగా సాగిపోయింది. దీంతో హిందువులతో పాటు తటస్థుల ఓట్లను రామాలయ నిర్మాణం తమకు తెచ్చిపెడుతుందని బీజేపీ ధీమాగా ఉంది.

Ram Temple impact On Elections 2024
Ram Temple impact On Elections 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 9:59 AM IST

Ram Temple impact On Elections 2024 : భక్తుల శతాబ్దాల కల అయిన అయోధ్యలోని శ్రీరాముని భవ్యమందిర నిర్మాణం సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని దశాబ్దాలుగా బీజేపీ వాగ్దానం చేస్తూనే ఉంది. నాడు అడ్వాణీ రథయాత్ర మొదలుకొని జరిగిన పరిణామాల్లో ఎప్పుడూ బీజేపీ రామ మందిర నిర్మాణంపై వెనక్కి తగ్గిందిలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన నుంచి బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వరకు ప్రధాని మోదీ చేతుల మీదుగానే సాఫీగా సాగిపోయింది. ఈ నేపథ్యంలో హిందువులతో పాటు తటస్థుల ఓట్లను రామాలయ నిర్మాణం తమకు తెచ్చిపెడుతుందని బీజేపీ ధీమాగా ఉంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి విపక్షాలు దూరంగా ఉండడం కూడా కమలదళానికి లాభమే చేకూర్చతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

మతపరమైన రాజకీయలకు తెర
సువిశాల భారత దేశం స్వాతంత్ర్య కాలం నుంచి సెక్యులర్ విధానాలనే అనుసరిస్తూ వస్తున్నప్పటికీ దేశంలో ఉన్నది మెజార్టీ ప్రజలు హిందువులే. దేశంలో కులపరమైన రాజకీయం ప్రభావం చూపుతున్నప్పటికీ 1980 దశకం నుంచి మతపరమైన రాజకీయం ప్రాముఖ్యం సంతరించుకుంది. అందుకు తెరతీసింది భారతీయ జనతా పార్టీనే. అయోధ్య రామ జన్మ భూమిలో రామాలయ నిర్మాణం కోసం తొలి నుంచి ఉద్యమించింది కమలదళమే. ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, వినయ్‌ కటియార్‌, ప్రవీణ్‌ తొగాడియా, మోహన్ భగవత్‌ ఇలా అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం నినదించారు. వీరంతా బీజేపీ లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్‌కు చెందినవారే. 2019 నవంబర్ 9న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తీర్పునకు వ్యతిరేకంగా దేశంలో ఎలాంటి అల్లర్లు, వ్యతిరేకత వ్యక్తంకాలేదు. వెంటనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రామాలయ నిర్మాణం కోసం శ్రీరామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది. ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణం ప్రారంభించింది. మసీదు కోసం వేరే చోట స్థలం కేటాయింపునకు చొరవ తీసుకుంది.

ఎన్నికల కోసమే హడావుడిగా ప్రాణ ప్రతిష్ఠ
500 ఏళ్లుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కలగా మిగిలిన పరిస్థితుల్లో వేగంగా ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. 2024 జనవరి 22న ప్రధాని మోదీ బాల రాముడి ప్రాణప్రతిష్ఠను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయితే, సార్వత్రిక ఎన్నికలు ఉన్నందునే ప్రధాని మోదీ హడావుడిగా ప్రాణప్రతి‌ష్ఠ నిర్వహించారని విపక్షాలు ఆరోపించాయి. ఆ కార్యక్రమానికి ఆహ్వానం అందినప్పటికీ దూరంగా ఉండిపోయాయి. ప్రాణప్రతిష్ఠను బీజేపీ, ఆరెస్సెస్‌ దేశమంతా పండగలా నిర్వహించాయి. ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేశాయి. కలశ యాత్రలు, ర్యాలీలు నిర్వహించాయి. ప్రజలకు రామచరిత మానస్ పుస్తకాలు, పేదలకు బట్టలు పంపిణీ చేశాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజన దేశమంతా వివిధ ఆలయాల్లో ఎల్‌ఈడీ తెరలపై కార్యక్రమాన్ని బీజేపీ వర్గాలు ఏర్పాటు చేశాయి. తద్వారా రామాలయ నిర్మాణ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు కమలదళం ప్రయత్నించిందని విపక్షాలు విమర్శించాయి. ఆ విమర్శలను పట్టించుకోని కాషాయ పార్టీ విపక్షాలపైనే ఎదురుదాడికి దిగింది. ప్రాణప్రతిష్ట కార్యక్రమం తర్వాత రోజు నుంచి వేలాది మంది భక్తులు అయోధ్యను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం బీజేపీకే లబ్ది చేకూర్చుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

కులగణన ప్రభావం చూపుతుందా
అప్పట్లో రామమందిర ఉద్యమం హిందువుల్లో మెజారిటీ వర్గాన్ని ప్రభావితం చేయడమే కాకుండా భారత రాజకీయాల స్వభావాన్ని మార్చేసిందని చెప్పాలి. నాటి నుంచి బీజేపీకి ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో హిందూ ఓటర్లలో జరిపిన సర్వేలో దాదాపు 51 శాతం మంది బీజేపీకి ఓటేశారని తేలింది. మతపరమైన పట్టింపులేని, రోజూ గుడికి వెళ్లనివారిలోనూ అధిక శాతం మంది కమలదళానికి ఓటేసినట్లు వెల్లడైంది. రామమందిర నిర్మాణం వల్ల ఏర్పడిన భావోద్వేగ వాతావరణాన్ని బీజేపీ ఉపయోగించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. రామమందిరం, హిందుత్వ ప్రభావం తగ్గించడానికి ప్రతిపక్ష పార్టీలు కులగణన అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తున్నాయి. అయితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.

లెక్కలోకి రాని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలు
కాంగ్రెస్, ప్రతిపక్షాలు రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉండటం వల్ల కొన్ని వర్గాలు విమర్శలు గుప్పించాయి. ఈ నిర్ణయం వల్ల హిందువులకు కాంగ్రెస్ దూరమైందనే వాదన తెరపైకి వచ్చింది. అయోధ్యలో కార్యక్రమానికి హాజరుకారాదని శంకరాచార్య నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊరటగా మిగిలింది. హిందూ మతానికి గురువులుగా భావించే శంకరాచార్యులు అయోధ్యలో జరుగుతున్నదంతా అశాస్త్రీయం అని చెప్పారని కాంగ్రెస్ నేతలు అన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో రామమందిరం ఒక అంశంగా మాత్రమే ఉంటుందనేది నిర్వివాదాంశం. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ఇతర సమస్యలను మందిరం మరిపించగలదా అంటే ఫలితాల తర్వాతే తెలుస్తుంది. ఇప్పటికే దేశ ప్రజలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో నిత్యం ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకోవడం చూస్తే ఇలాంటి సమస్యలను పెద్దగా పట్టించుకోవటంలేదనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణం బీజేపీకే లబ్ది చేకూర్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గుజరాత్​లో బీజేపీతో ఆప్, కాంగ్రెస్ ఢీ- మోదీ సొంత రాష్ట్రం మరోసారి క్లీన్​ స్వీప్​ కానుందా? - gujarat lok sabha elections 2024

తొలి లోక్​సభ ఎన్నికలు జరిగి 73ఏళ్లు- అప్పుడు 14, ఇప్పుడు 6- ఏంటీ కథ? - Loksabha Election National Parties

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.