Pratidhwani on Phone Tapping in AP: 'నేను ఉన్నాను, నేను విన్నాను' ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఫేమస్ స్లోగన్. అంటే ఆయనేదో ప్రజాసమస్యలు వింటున్నారని అనుకుంటే పొరబడినట్లే. అసలు వాస్తవం వేరని రాష్ట్రం కోడై కూస్తోంది. కేబినెట్ సహచరుడి నుంచి సాధారణ విలేకరి దాకా, అందరి మాటలూ అన్న వింటున్నారని అధికార పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఫోన్ డేటానూ అన్న చూస్తున్నారని గుసగుసలాడుతున్నారు. తెలుగుదేశం వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాప్ చేస్తూ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పబ్లిక్‌గా దొరికిపోవడం, ఈ ఘట్టానికి పరాకాష్టగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిణామాల్ని చట్టం అసలు అనుమతిస్తుందా? ప్రభుత్వం మారితే అనధికార ట్యాపింగ్ నేరాలకు వాళ్లంతా ఎలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతుంది. విపక్షాలతోపాటు స్వపక్షాన్ని వదలకుండా ట్యాపింగ్ చేస్తున్న నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మంత్రి నుంచి సాధారణ వ్యక్తి దాకా అందరూ బాధితులుగా మారుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులూ ట్యాపింగ్ బారిన పడ్డవారుగా మారుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరి మాటలూ రహస్యంగా వింటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార పార్టీ నేతల బహిరంగంగా వ్యాఖ్యలు దేనికి నిదర్శనం. ఫోన్ డేటానూ అన్న చూస్తున్నారని అంతటా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫోన్ డేటానూ అన్న చూస్తున్నారని అంతటా గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో, ట్యాపింగ్ వ్యవహారంపై ఈటీవీ ప్రతిధ్వని చర్చ చేపట్టింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జగనన్నకు ఉన్న కసి ఏంటి - దానికోసం ఏ మేరకు పని చేశారు?
వైసీపీ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాప్ చేస్తూ చిక్కిన కానిస్టేబుల్ ఘటన రాష్ట్ర అంతా చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఫోన్ కాల్స్ చేయాలంటే అధికార వర్గాల్లో దడ పుట్టే పరిస్థితులు నెలకొన్నాయి. అధినేత నిఘాకు చిక్కకుండా మాట్లాడేందుకు వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్‌టైమ్ వినియోగిస్తున్న స్వంత పార్టీ నేతలు. ఏ యాప్ వాడినా ట్యాప్ చేయవచ్చంటున్న నిపుణులు. స్విచాఫ్ చేసిన ఫోన్‌నూ హ్యాకింగ్ చేసే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఈసమస్యకు అప్రమత్తతే పరిష్కారమని సాంకేతిక నిపుణులు అంటున్నారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది మెుదలూ ట్యాపింగ్ మెుదలైందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వస్తే ఈ పరిస్థితి మారుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టుపట్టిన ఏపీపీఎస్సీ - తమవారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అడ్డదారులు
ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే హోం సెక్రటరీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, నిరంతరం ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేక అనుమతలు తీసుకోవాలి, కానీ ఎలాంటి అనుమతులు లేకుండా, అధికార ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. తెలంగాణలో మాత్రమే కాదు, ఏపీలో సైతం అంతకు మించి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఏపీలో ఉండాలంటే బయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, అధికారులంతా ట్యాపింగ్ బాధితులుగా మారుతున్నారు. ప్రతిపక్షాలను అంతం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిధ్వని కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు ఆరోపించారు.
నవరత్నాల పేరుతో జగన్ నయవంచన - అసలు విషయం ఏంటంటే? - YSRCP Navaratnalu Schemes