ETV Bharat / offbeat

ఒత్తిడి తగ్గించేలా వీకెండ్ ప్లాన్​ - ట్రెక్కింట్​, ఫొటోగ్రఫీ, బైక్​ రైడింగ్​పై యువత ఆసక్తి - YOUTH ENJOYING IN WEEKEND TRIP

సెలవులను ఎంజాయ్​ చేస్తున్న యూత్ - లైఫ్​లో ఒత్తిడి తగ్గుతుందంటున్న నిపుణులు!

Youth Enjoying in Weekends
Youth Enjoying in Weekends (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2025, 4:23 PM IST

Youth Enjoying in Weekends : వీకెండ్స్​, హాలిడేస్​ వస్తున్నాయంటే చాలు ఎక్కువ మంది విద్యార్థులు చదువు, యువకులు ఉద్యోగం, వ్యాపారానికి కొంచెం విరామం ప్రకటిస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా ఫ్రెండ్స్​, కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. విహారయాత్రలకు వెళ్లి పర్వతారోహణ (ట్రెక్కింగ్‌) చేస్తూ ప్రకృతి అందాల మధ్య గడుపుతూ జీవితంలో కొత్త అనుభూతిని, మధుర జ్ఞాపకాలను నింపుకుంటున్నారు. కొందర బుల్లెట్‌లపై దూర ప్రాంతాల సాహస యాత్రలు కూడా చేస్తున్నారు. ఫొటోగ్రఫీ ఇష్టపడే వారు కెమెరాలు తీసుకుని నదీ, సముద్ర తీరాలు, అటవీ ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి రమణీయ దృశ్యాలు, పల్లె జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఫొటోలు తీస్తున్నారు. ఇలా లైఫ్​ని ఎంజాయ్​ చేయడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ దొరికితే తీరంలో ప్రత్యక్షం :

బాపట్ల ఫార్మసీ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నా కొత్తకోట వినయ్ వినయ్​, ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమని చెబుతున్నారు. వారంలో 5 రోజులు కళాశాలలో తరగతులకు హాజరవుతూ వీకెండ్స్​లో మాత్రం కెమెరా తీసుకుని సముద్రతీరానికి వెళ్లిపోతుంటానని అంటున్నారు. సూర్యలంక, వాడరేవు, రామాపురం బీచ్‌లో సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు, చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులు, వారి జీవనశైలిని ప్రతిబింబించేలా చిత్రాలు తీస్తుంటానని తెలిపారు. అటవీ భూముల్లో పచ్చదనం, అరుదైన వలస పక్షుల ఛాయాచిత్రాలను కెమెరాలో బంధించడం అలవాటని పేర్కొన్నారు. సహచారులు, స్నేహితులకు ఫొటోలు తీయటం నేర్పిస్తున్నానని చెప్పారు.

ట్రెక్కింగ్‌ కోసం ప్రత్యేక శిక్షణ :

ట్రెక్కింగ్‌ అంటే ఇష్టమని బాపట్లకు చెందిన ప్రైవేటు ఉద్యోగి యంపరాల సందీప్ చెబుతున్నారు. సెలవు రోజుల్లో స్నేహితులతో కలిసి కొండ ప్రాంతాలకు వెళ్లి ట్రెక్కింగ్‌ చేస్తుంటానని, ఊటీ, కొడైకెనాల్, మున్నార్, సిమ్లా, కులు మనాలి, డెహ్రాడూన్, ముస్సోరి తదితర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్తుంటానని చెప్పారు. ట్రెక్కింగ్‌ చేస్తూ పచ్చని కొండలు, సెలయేరులు, జలపాతాలు, మంచు అందాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు తిలకిస్తుంటానని పేర్కొన్నారు. తలకోన, హార్సిలీహిల్స్, అరకులోయను సందర్శించి పర్వతారోహణ చేశానని అన్నారు. ట్రెక్కింగ్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని చెప్పారు. ఉద్యోగ, వృత్తి జీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి వారాంతం, సెలవు రోజుల్లో పర్వత ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి అందాల మధ్య సంతోషంగా గడుపుతున్నానని తెలిపారు.

దూర ప్రాంతాలకు బుల్లెట్‌పై :

ఇంజినీరింగ్‌ చదివి బాపట్లలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డా నల్లమోతు శ్రీకాంత్ బుల్లెట్‌పై దూర ప్రాంతాలకు వెళ్లడం ఇష్టమని చెబుతున్నారు. ఫ్రెండ్స్​తో కలిసి బుల్లెట్‌ క్లబ్‌లో సభ్యుడిగా చేరానని, వీకెండ్, సెలవు రోజుల్లో క్లబ్‌ సభ్యులు, స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు బుల్లెట్లపై రయ్‌రయ్‌మంటూ వెళ్తుంటామని తెలిపారు. రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక దుస్తులు ధరించి బుల్లెట్‌లపై వెళ్తూ గండికోట, మున్నార్, కూర్గ్, ఊటీ, కొడైకెనాల్, రామేశ్వరం, కన్యాకుమారి, గుజరాత్, రాజస్థాన్, లేహ్‌ తదితర ప్రాంతాలను సందర్శిస్తుంటామని చెప్పారు. క్లిష్టమైన ఘాట్‌ రోడ్లలో ఇష్టంగా ప్రయాణిస్తున్నామని అన్నారు. బుల్లెట్‌లపై వెళ్లి కొత్త ప్రాంతాలను సందర్శించి మధురానుభూతి పొందుతున్నామని పేర్కొన్నారు.

ఇంట్లో చిన్నోళ్లపైనే గారాబం ఎక్కువనేది నిజమేనా? - పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే!

రాత్రిళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? - వాటి అరుపుల వెనుక కారణాలేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.