What is UPI Limit in a Bank : ఇప్పుడు ప్రతి ఒక్కరు పేమెంట్ చేయాలంటే వెంటనే ఫోన్ తీసి యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అలాగే ఆన్లైన్లో చాలానే చాలానే చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి డిజిటల్ చెల్లింపులు దేశంలో ఊపందుకున్నాయి. ఇప్పుడు ఈ యూపీఐ తక్కువ సమయంలో ఎక్కువ మంది ఉపయోగించే సాధనంగా మారిపోయింది. తాజాగా ఆర్బీఐ యూపీఐ లైట్ పేరుతో డిజిటల్ చెల్లింపులను మరింత పెంచేందుకు మార్పులు తీసుకొచ్చింది. అయితే రోజువారీ చెల్లింపుల్లో మాత్రం ఆర్బీఐ బ్యాంకులకు పరిమితులు విధించింది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందామా?
హెచ్డీఎఫ్సీ బ్యాంక్(HDFC BANK) : ఈ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో రోజుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు. 24 గంటల్లో గరిష్ఠంగా 20 లావాదేవీలకు అనుమతి ఇస్తోంది.
ఎస్బీఐ(SBI) : రోజువారి చెల్లింపుల మొత్తాల పరిమితిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.లక్షగా నిర్ణయించింది. ఎస్బీఐ తరహాలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్‌లు ఇదే పరిమితిని అనుసరిస్తున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్(ICICI BANK) : ఈ బ్యాంక్‌లో గరిష్ఠం లావాదేవీల పరిమితి రూ.లక్షగా నిర్ణయించారు. అన్ని లావాదేవీలు కలిపి రోజు మొత్తంలో రూ. లక్ష వరకే అనుమతి ఇస్తోంది. 24 గంటల్లో గరిష్ఠంగా 10 లావాదేవీలు జరిపేందుకు ఈ బ్యాంక్ అనుమతిని ఇస్తోంది.
కెనరా బ్యాంక్ (Canara Bank): యూపీఐ ద్వారా చేసే వ్యక్తిగత లావాదేవీలపై కెనరా బ్యాంక్ రూ.లక్ష పరిమితిని విధించింది. రోజుకు 20 వరకు లావాదేవీలు చేయవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): రోజువారీ చెల్లింపుల పరిమితిని బ్యాంక్ ఆప్ బరోడా రూ.లక్షగా పేర్కొంది. రోజులో గరిష్ఠంగా 20 లావాదేవీలు జరపవచ్చు. ఇందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అవకాశం కల్పించింది.
యాక్సిస్ బ్యాంక్(AXIS BANK): యాక్సిస్ బ్యాంక్ డెబిట్ ఫండ్ చెల్లింపులు లేదా వ్యక్తిగత చెల్లింపులపై రోజువారీ లిమిట్‌ను రూ.లక్షగా నిర్ణయించింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్(Kotak Mahindra) : ఈ బ్యాంక్‌లో గరిష్ఠంగా రూ.లక్ష వరకు బదిలీ చేయవచ్చు. రోజులో 10 లావాదేవీలు చేయాలి. ఒకవేళ క్యూఆర్ కోడ్‌ని అప్లోడ్ చేసి డబ్బు చెల్లింపులు చేయాలంటే రూ.2,000 వరకు మాత్రమే అనుమతిస్తోంది.
ఈ లావాదేవీలపై పెంపు : తాజాగా ఆర్బీఐ యూపీఐ ద్వారా చేసే లావాదేవీలకు పన్ను చెల్లింపుల పరిమితిని పెంచింది. ఈ మొత్తాలు రూ.లక్షగా ఉన్న మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఆస్తి పన్ను, ముందస్తు పన్ను, వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.5 లక్షల వరకు చెల్లించవచ్చు. అదే క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, పారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్‌లకు రూ.2 లక్షలు, ఐపీఓ, రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌లో రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేయవచ్చు. కానీ వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ లావాదేవీలను మాత్రం రూ.1 లక్ష వరకే అనుమతిస్తోంది.