ETV Bharat / offbeat

బొజ్జ గణపయ్యకు "ఉండ్రాళ్ల పాయసం" - ఇలా చేసి పెడితే వినాయకుడు ఎంతో ఆనందిస్తాడు! - Undralla Payasam Recipe - UNDRALLA PAYASAM RECIPE

Undralla Payasam Recipe : బొజ్జ గణపయ్యకు అత్యంత ప్రీతికరమైన నైవేద్యం.. ఉండ్రాళ్లు. అయితే.. ఈ పాయసాన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్​గా చేసుకోవచ్చు. మరి, ఈ ప్రసాదానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

How to Make Undralla Payasam
Undralla Payasam Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 1:46 PM IST

Updated : Sep 5, 2024, 2:18 PM IST

How to Make Undralla Payasam : వినాయక చవితి వేళ.. భక్తులు ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు తయారు చేసి.. ఆ బొజ్జ గణపయ్యను ప్రసన్నం చేసుకుంటుంటారు భక్తులు. అలాంటి వాటిల్లో విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం.. ఉండ్రాళ్లు. అయితే, చాలా మందికి ఉండ్రాళ్ల పాయసాన్ని(Undrallu) రుచికరంగా ప్రిపేర్ చేసుకోవడం రాదు. అలాంటి వారు ఈ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఉండ్రాళ్ల పాయసాన్ని తయారు చేసుకోవచ్చు! మరి, ఇంకెందుకు ఆలస్యం..? ఈ సూపర్ టేస్టీ ఉండ్రాళ్ల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • పాలు - ఒకటిన్నర కప్పు
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
  • బాదం పప్పు - 1 టేబుల్ స్పూన్
  • జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్
  • పచ్చికొబ్బరి ముక్కలు - 1 టేబుల్ స్పూన్
  • బెల్లం - 1 కప్పు
  • యాలకుల పొడి - అరటీస్పూన్

ఉండ్రాళ్ల పిండి కోసం :

  • నీళ్లు - 1 కప్పు
  • బెల్లం - 2 టేబుల్ స్పూన్లు
  • నెయ్యి - 1 టీస్పూన్
  • కొబ్బరి పొడి - 2 టేబుల్ స్పూన్లు
  • బియ్యపుపిండి - 1 కప్పు

వినాయక చవితి రోజు ఏ రాశివారు ఏ ప్రసాదం పెట్టాలి? - ఏ రంగు గణపతిని పూజిస్తే అదృష్టం?

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో శనగపప్పును కడిగి 10 నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. మీరు పాయసం స్టార్ట్ చేసే ముందు ఈ పప్పును నానబెట్టుకుంటే సరిపోతుంది.
  • ఇప్పుడు.. ఉండ్రాళ్ల పిండి కోసం స్టౌపై పాన్ పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో బెల్లం, నెయ్యి, కొబ్బరిపొడి వేసుకోవాలి.
  • ఈ విధంగా బెల్లం, నెయ్యి, కొబ్బరిపొడి వేసుకోవడం వల్ల ఉండ్రాళ్లు తినేటప్పుడు గట్టిగా అనిపించకుండా సాఫ్ట్​గా, చాలా టేస్టీగా ఉంటాయి.
  • ఆ తర్వాత బాగా కలిపి మిశ్రమం కాస్త గోరు వెచ్చగా అయ్యాక.. అందులో బియ్యపుపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆపై స్టౌ లో-ఫ్లేమ్​లో ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలి. అది కొంచం పిండి ముద్దలా వచ్చాక స్టౌ ఆఫ్ చేసుకొని పాన్​ను దించుకొని చల్లార్చుకోవాలి.
  • ఆలోపు మరో గిన్నెలో పాలు తీసుకొని స్టౌపై మరిగించుకోవాలి.
  • అనంతరం పిండి కాస్త చల్లారాక మెదుపుతూ ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. ఈ టైమ్​లో పిండి పొడిపొడిగా అనిపిస్తే చేతులు తడి చేసుకోనైనా కలుపుకోవచ్చు.
  • పిండిని బాగా కలిపి ముద్దలాగా చేసుకున్నాక.. ఒక చిన్న బౌల్​లో కాస్త పొడి పిండిని తీసుకోవాలి. ఆపై చేతులకు కొంచం పొడి పిండిని అద్దుకుంటూ.. కొద్దిగా పిండిముద్దను తీసుకుంటూ చిన్న చిన్న ఉండ్రాళ్లుగా ప్రిపేర్ చేసుకోవాలి.
  • అయితే, మొత్తం పిండిని చేసుకోకుండా పెద్ద నిమ్మకాయంత సైజ్ పిండిని పక్కకు తీసుకొని మిగతా పిండిని ఉండ్రాళ్లుగా చుట్టుకోవాలి.
  • ఆ తర్వాత పక్కకు తీసుకున్న పిండి ముద్దను ఒక చిన్న బౌల్​లో వేసి అందులో కొద్దిగా వాటర్ పోసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • అనంతరం.. స్టౌపై మరో పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు పలుకులు వేసుకొని అవి దోరదోరగా మారే వరకు ఫ్రై చేసుకొని.. నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో.. రెండున్నర కప్పుల వాటర్ పోసుకోవాలి. అయితే, ఇక్కడ మీరు తీసుకునే అన్నింటికి ఒకే కప్పు వాడాలనే విషయం గుర్తుంచుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, సన్నగా తరుకున్న పచ్చికొబ్బరి ముక్కలు వేసి పప్పు కాస్త మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు.
  • ఆ విధంగా ఉడికించుకున్నాక.. అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్లను వేసి మధ్యమధ్యలో కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల పాటు మరోసారి ఉడికించుకోవాలి.
  • ఉండ్రాళ్లు సాఫ్ట్​గా ఉడికాయనుకున్నాక.. అందులో బెల్లం తురుము వేసి బాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి.
  • తర్వాత పాయసం చిక్కగా రావడానికి ఆ మిశ్రమంలో ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ మరో 3 నుంచి 4 నిమిషాలు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
  • అప్పుడు పాయసం చిక్కబడ్డాక అందులో యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్​ను నెయ్యితో సహా వేసుకొని కలుపుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ వేసి పాన్​ను దించుకొని మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ కాస్త చల్లార్చుకోవాలి.
  • పాయసం కొద్దిగా చల్లారాక మరిగించుకున్న పాలను అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం ద్వారా పాలు విరగకుండా చక్కగా ఉంటాయి. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే మధురమైన ఉండ్రాళ్ల పాయసం రెడీ!
  • తర్వాత దాన్ని కొద్దిగా గిన్నెలోకి తీసుకొని బొజ్జగణపయ్యకు నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుంది!

వినాయక చవితి స్పెషల్ : సూపర్ టేస్టీ "మలై మోదకాలు" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

Last Updated : Sep 5, 2024, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.