ETV Bharat / offbeat

భారత్​లో విదేశీ టూరిస్టులు వెతికిన టాప్ 10 ప్రాంతాలు ఇవే! - అవేంటో మీకు తెలుసా?

- రిపోర్ట్ విడుదల చేసిన "బుకింగ్ డాట్ కామ్" - తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ప్రాంతం

author img

By ETV Bharat Features Team

Published : 2 hours ago

Foreigners Most Searched Places
Foreigners Most Searched Places (ETV Bharat)

Foreigners Most Searched Places in India: భారతదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. మన దేశంలో ఫేమస్ టూరిస్టు ప్లేసులు ఏమేం ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అంటూ.. ఆన్​లైన్​లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. మరి.. ఈ మేరకు "బుకింగ్ డాట్ కామ్" అనే పర్యాటక సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది. మరి ఇందులో ఉన్న టాప్​ 10 ప్రాంతాలు ఇవే.

దిల్లీ: ఈ జాబితాలో దేశ రాజధాని దిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. దిల్లీలోని కుతుబ్ మినార్, ఎర్రకోట, ఇండియా గేట్, హుమాయున్ టూంబ్స్ వంటి చారిత్రక కట్టడాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ముంబయి: 'ద సిటీ ఆఫ్ డ్రీమ్స్​', దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబయి ఎల్లప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇక్కడికి విదేశీయులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చారిత్రక గేట్ వే ఆఫ్ ఇండియా, జుహూ బీచ్​ లాంటి ప్రదేశాలపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

బెంగళూరు: టెక్నాలజీ క్యాపిటల్​గా పిలుచుకునే కర్ణాటక రాజధాని బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఉండే లాల్​బాగ్ బొటానికల్ గార్డెన్, బెంగళూరు ప్యాలెస్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇదే కాకుండా అనేక చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో విదేశీ పర్యటకలు ఆసక్తి చూపిస్తారు.

చెన్నై: ఆ తర్వాత స్థానంలో తమిళనాడు రాజధాని చెన్నై నిలిచింది. దీనికి సమీపంలో ఉండే అతి పురాతన ఆలయాలు, సంస్కృతి.. విదేశీ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మెరీనా బీచ్, మహాబలేశ్వరం, కపాలేశ్వర ఆలయం, సెయింట్ జార్జ్ కోట చెన్నైలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

హంపీ: ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపీని విదేశీయులు ఎక్కువగా సెర్చ్ చేశారు. కర్ణాటకలోని హంపీ యూనెస్కో వారసత్వ గుర్తింపు సైతం పొందింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉండే పురాతన ఆలయాలు, కట్టడాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యటకులు వస్తారు.

లెహ్: విదేశీ పర్యటకులు ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రాంతాల జాబితాలో లద్దాఖ్​లో భాగమైన లెహ్ ఆరో స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి ఎత్తైన హిమాలయాలను చూసే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రకృతి ప్రేమికులు, ట్రావెలర్స్ హిమాలయాలు చూడడంతో పాటు ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి ఎక్కువగా వస్తారు.

పాట్నీ టాప్: జమ్ము కశ్మీర్​ ఉధంపుర్​ జిల్లాలోని పాట్నీ టాప్​ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఉండే శివాలిక్ కొండల నుంచి సూర్యోదయం, సూర్యస్తమయం, పచ్చికబయళ్లను చూసేందుకు విదేశీ పర్యటకులు ఆసక్తి చూపిస్తారు.

పహల్ గామ్: ఈ జాబితాలో ఎనిమిదో స్థానం కూడా జమ్ము కశ్మీర్​లోని పహల్ గామ్ దక్కించుకుంది. అనంత్​నాగ్ జిల్లాలో ఉండే బెతాబ్ వ్యాలీ, అరు వ్యాలీ విదేశీ పర్యటకులను బాగా ఆకట్టుకుంటాయి.

కూర్గ్: కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలోని మదికెరి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఉండే కోట, కాఫీ తోటలు, కొండలు, జలపాతాలను చూసేందుకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.

విజయవాడ: ఇక పదో స్థానంలో ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నిలిచింది. ఇక్కడ ప్రవహించే కృష్ణా నది, కనకదుర్గ ఆలయం, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి కేవ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

IRCTC దిల్లీ టూర్ - కృష్ణ జన్మభూమి మథురతోపాటు, మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు!

ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ - ఆరు రోజుల పాటు మేఘాలయ, అస్సాం అందాలు చూడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.