ETV Bharat / offbeat

మీ జీవితానికి పూల బాటలు వేసిన ప్రియమైన గురువులకు - టీచర్స్​ డే స్పెషల్​ విషెస్​ - ఇలా చెప్పండి! - TEACHERS DAY 2024 WISHES and Quotes

Teachers Day 2024 : మన జీవితంలోని అజ్ఞానపు చీకట్లను తొలగించి వెలుగులవైపు నడిపించే వారే ఉపాధ్యాయులు. ప్రతి ఒక్కరి లైఫ్​లో కనీసం ఒక్కరైనా ఆత్మీయ గురువు ఉంటారు. అందుకే సెప్టెంబర్​ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మీ జీవితానికి వెలుగులు దిద్దిన టీచర్లకు ప్రత్యేకంగా ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. అందుకోసం ఈటీవీ భారత్​ కొన్ని విషెస్​, కోట్స్​ అందిస్తోంది..!

Teachers Day
Teachers Day 2024 Wishes and Quotes (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 4, 2024, 5:09 PM IST

Teachers Day 2024 Wishes and Quotes : ఓ వ్యక్తి జీవితంలో స్థిరపడేందుకు ముగ్గురు వ్యకులు సహాయపడతారు. వారిలో మొదటి ఇద్దరూ తల్లిదండ్రులైతే.. మూడవ వ్యక్తి గురువు. చిన్నతనంలో అక్షరాలు దిద్దించి విద్యకు పునాదులు వేయడంతో పాటు, తన జీవితంలోని అనుభవ పాఠాలను భోధించి.. సమాజంలో గౌరవంగా ఎలా జీవించాలో నేర్పించేవారు ఉపాధ్యాయులు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం సెప్టెంబర్​ 5వ తేదీన డాక్టర్​ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా 'ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day)' జరుపుకుంటాం. ఈ క్రమంలోనే చాలా మంది తమ గురువులకు విషెస్​ చెప్పడం, గిఫ్ట్​లు ఇవ్వడం చేస్తుంటారు. మరి మీరు కూడా మీకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు టీచర్స్​ డే రోజు స్పెషల్​గా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ కోసం "ఈటీవీ భారత్" ప్రత్యేకంగా అందిస్తున్న స్పెషల్​ విషెస్​, కోట్స్​ ఒకసారి చూసేయండి..!​

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 2024 :

Teachers Day 2024 Wishes:

"మీ మార్గనిర్దేశం, మీరందించిన జ్ఞానం నా జీవిత ప్రయాణంలో వెలుగు నింపాయి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ప్రతిరోజు నన్ను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు సర్​"- హ్యాపీ టీచర్స్​ డే

"కేవలం పాఠ్య పుస్తకాలలో ఉన్న పాఠాలే కాకుండా.. మీ జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో క్లిష్టమైన అనుభవ పాఠాలను చిన్నప్పుడే నేర్పించారు. వాటి ద్వారా నా జీవితానికి బాటలు వేసుకున్నాను మాస్టారు."- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

"ప్రపంచానికి, మీరు కేవలం ఉపాధ్యాయులు కావచ్చు. కానీ మీరు నాకు ఒక ఆదర్శవంతమైన వ్యక్తి." -ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

"నా లోని భయం, లోపాలన్నింటినీ సరిదిద్ది.. జీవితంలో స్థిరపడేలా అన్ని విధాలా కృషి చేసిన మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సర్​." -హ్యాపీ టీచర్స్​ డే

"ఎందరినో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది..

తాను మాత్రం అదే స్థానంలో ఉంటూ..

ఆనందపడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో..

తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని బాధ్యతగా చేపట్టే గురువులందరికీ.." - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

"గురు బ్రహ్మ, గురు విష్ణు గురదేవో మహేశ్వరః

గురు సాక్షాత్​ పరబ్రహ్మ.. తస్మా శ్రీ గురవే నమః" -హ్యాపీ టీచర్స్​ డే సర్​

"ఒక శిల్పి ఎంతో ఓర్పుగా రాయిని చెక్కినట్లుగా.. మీరు నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మీరు చేసిన ఈ హెల్ప్​కి చాలా ధన్యవాదాలు మాస్టారు." -ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

"మనకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయుడు​ పాఠాలు చెబితే.. తరగతి గది​ కూడా ఇళ్లులా మారిపోతుందట..

ఇప్పుడు నేను ఆ ఇంటిని చాలా మిస్​ అవుతున్నాను సర్​"- ప్రేమతో మీ స్టూడెంట్​

"విద్యార్థుల పట్ల మీరు చూపించిన ప్రేమ, అంకితభావం నిజంగా అభినందనీయం సర్​. మా మనసును మాత్రమే కాకుండా మా భవిష్యత్తును కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకు సదా కృతజ్ఞుడిని."- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 2024.

హ్యాపీ టీచర్స్ డే బెస్ట్ కోట్స్ మీ కోసం..

Happy Teachers Day Quotes:

"సొంతంగా వెయ్యి రోజుల పాటు ఏదైనా ఒక అంశంపై పరిశోధన చేయడం కంటే.. ఉపాధ్యాయునితో అదే విషయంపై ఒక రోజు చర్చించడం ద్వారా ఎక్కువగా నేర్చుకోవచ్చు."- జపనీస్ సామెత

"ఒక పెన్ను, ఒక పుస్తకం​, ఒక మంచి విద్యార్థి, ఒక గురువు​ ఈ ప్రపంచాన్ని మార్చగలుగుతారు."- మలాలా యూసఫ్‌జాయ్

"ప్రతి ఉపాధ్యాయుడు కొవ్వొత్తి లాంటివాడు.. ఇతరులకు వెలుగినివ్వడం కోసం నిస్వార్థంగా తనను తాను అర్పించుకుంటాడు"- ముస్తఫా కెమాల్ అటాటర్క్

"ఒక దేశం అవినీతి రహితంగా, కల్మషం లేకుండా, ఆనందంగా మారాలంటే ముగ్గురు వ్యక్తులు కీలకపాత్ర పోషిస్తారని నేను విశ్వాసిస్తాను. వారు తండ్రి, తల్లి, గురువు" - డాక్టర్ APJ అబ్దుల్ కలాం.

"మన గురించి ఆలోచించడంలో సహాయపడేవారే నిజమైన ఉపాధ్యాయులు."- సర్వేపల్లి రాధాకృష్ణన్

ఇవి కూడా చదవండి :

మీ ప్రియమైన గురువులను తలుచుకుంటూ.. టీచర్స్ డే శుభాకాంక్షలు.. ఇలా చెప్పండి

Teachers Day 2022: ప్రథమ నమస్కారం గురువుకే ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.