ETV Bharat / offbeat

శ్రావణం స్పెషల్​ - అమ్మవారికి ఎంతో ఇష్టమైన "పూర్ణం బూరెలు" - ఈ సీక్రెట్​ టిప్స్​ పాటిస్తే సూపర్​ టేస్ట్​! - Sravana Masam Poornam Boorelu

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 2:26 PM IST

Poornam Boorelu: శ్రావణమాసంలో మహిళలందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారి అనుగ్రహం కోరుతూ తమ శక్తి మేరకు ప్రసాదాలు సమర్పిస్తారు. ఎన్ని ప్రసాదాలు చేసినా అందులో పూర్ణం బూరెలు తప్పకుండా ఉండాల్సిందే. మరి పూర్ణం బూరెలు పర్ఫెక్ట్​గా రావాలంటే ఈ టిప్స్​ తప్పనిసరిగా పాటించాలి.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Sravana Masam Special Poornam Boorelu: శ్రావణ మాసం వచ్చిదంటే ప్రతి ఇంట్లో సందడి ఉంటుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో ఈ నెలంతా కోలాహలంగా మారుతుంది. ఇక ముత్తైదువులు మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారం వ్రతం ఆచరిస్తూ ఇంటికి కొత్త శోభను తెస్తారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోరుతూ అమ్మవారిని పూజించి తమ శక్తి మేరకు నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక నైవేద్యాలు అంటే చాలా మంది రకరకాలుగా చేస్తుంటారు. అయితే ఎన్ని రకాలు చేసినా పూర్ణం బూరెలు మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. అందరికీ పూర్ణాలు చేయడం వచ్చినా కొన్నిసార్లు మంచిగా కుదరవు. అలాంటి సమయంలో ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే సూపర్​గా వస్తాయి. మరి లేట్​ చేయకుండా ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దామా.

పూర్ణం బూరెలు:

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యం - 1 కప్పు
  • మినపప్పు - ముప్పావు కప్పు
  • చక్కెర - 2 టీస్పూన్లు
  • పచ్చి శనగపప్పు - కప్పు
  • పసుపు - పావు టీ స్పూన్
  • నెయ్యి - తగినంత
  • ఉప్పు - తగినంత
  • బెల్లం - 1 కప్పు
  • నీళ్లు - తగినన్ని
  • సోంపు - 1 టీ స్పూన్​
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్​
  • నూనె - డీప్​ ఫ్రై కి సరిపడా

శ్రావణమాసం స్పెషల్ : పక్కా కొలతలతో గుడిలో పెట్టే "పరమాన్నం" - నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

తయారీ విధానం:

  • ముందుగా బియ్యం, మినపప్పు విడివిడిగా తీసుకుని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉదయం పూట అమ్మవారికి నైవేద్యం సమర్పించాలనుకుంటే రాత్రే ఈ పిండి తయారు చేసుకోవడం మంచిది.
  • ఇక బియ్యం, మినపప్పు నానిన తర్వాత మిక్సీజార్​లోకి తీసుకుని నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. అయితే పూర్ణాలు ఎప్పుడు తిన్నా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్​గా రావాలంటే మరికొన్ని బియ్యం తీసుకుని కడిగి నానబెట్టి తర్వాత మిక్సీ జార్​లోకి తీసుకుని కొంచెం బరకగా గ్రైండ్​ చేసుకుని బియ్యం పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. అలాగే అందులోకి 2 టీస్పూన్ల చక్కెర, చిటికెడు ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి.
  • అలాగే పచ్చి శనగపప్పును కూడా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 2 గంటలు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత పప్పును నీళ్లు లేకుండా ఒంపి కుక్కర్​లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకుని, పసుపు, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్​ నెయ్యి వేసుకుని స్టవ్​ మీద పెట్టి నాలుగు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • పప్పు ఉడికిన తర్వాత అందులోని నీరు పోయేందుకు పప్పును జల్లెడలో వేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత పప్పును మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి బెల్లం తురుము వేసి.. 2 టీ స్పూన్ల నీళ్లు పోసి కరిగించుకోవాలి.
  • బెల్లం కరిగిన తర్వాత అందులోకి గ్రైండ్​ చేసుకున్న పప్పు వేసుకుని బాగా కలిపి ఓ మూడు నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత యాలకుల పొడి, సోంపు, నెయ్యి వేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకుని స్టవ్​ ఆఫ్​ చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • పిండి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా ప్రిపేర్​ చేసుకున్న బియ్యప్పిండిని మరోసారి కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగానే ప్రిపేర్​ చేసుకున్న పూర్ణాన్ని బియ్యపిండిలో ముంచి చేతితో కాకుండా స్పూన్​ సాయంతో నూనెలో వేస్తే గుండ్రంగా వస్తాయి.
  • ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకోవాలి. అన్నింటిని అలానే చేసుకుని పక్కకు పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా పెడితే.. అమ్మ అనుగ్రహం లభిస్తుంది.

ఈ టిప్స్​ పాటిస్తే ఇంకా పర్ఫెక్ట్​గా పూర్ణాలు:

  • బెల్లం, శనగపప్పు మిశ్రమం ఎప్పడూ కొంచెం మందంగానే చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు ఆ మిశ్రమం పల్చగా అవుతుంది. అలా పల్చగా అయినప్పుడు.. స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి ఓ 2 టేబుల్​ స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకుని దోరగా వేయించి.. దానిని బెల్లం మిశ్రమంలో కలిపితే 5 నిమిషాల తర్వాత పిండి గట్టిగా అవుతుంది.
  • పూర్ణాలను నూనెలో వేసి ఫ్రై చేసేటప్పుడు అందులోని బెల్లం మిశ్రమం బయటికి వస్తున్నట్లు అనిపిస్తే దానిని బయటికి తీసి కాస్తా చల్లారాక.. దానిపై బియ్యప్పిండి మిశ్రమం వేసి నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే సరి.

ఇవీ చదవండి:

వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి దాకా - ఈ నెలలో ఎన్ని పండగలు ఉన్నాయో మీకు తెలుసా?

అలర్ట్ : మీరు గృహ ప్రవేశం చేయబోతున్నారా? - ఈ విషయం తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.