Tips for Children Uniforms Washing: స్కూల్ ఏదైనా పిల్లలకు యూనిఫామ్ సాధారణమే. అయితే.. అవి చాలా వరకు వైట్, క్రీమ్ కలర్లో ఉంటుంటాయి. అవి వేసుకుంటే మంచి లుకింగ్ వస్తుంది. కానీ.. అసలు ప్రాబ్లమ్ వచ్చేసరికి వాషింగ్. ఎందుకంటే.. పిల్లలు ఒక్క దగ్గర కుదురుగా ఉండరు. ఈ క్రమంలోనే వాటిపై పెన్ను, పెన్సిల్ గీతలు, ఫుడ్, చాక్లెట్ మరకలు.. ఇలా ఏవేవో మరకలు పడుతుంటాయి. అప్పుడు వాటిని ఉతకడం తల్లులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది.
కొన్నిసార్లు ఎంత రుద్ది ఉతికినా ఆ మరకలు ఒక్కపట్టాన పోవు. మరి, మీరూ పిల్లల యూనిఫామ్స్ విషయంలో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారా? అయితే, మీకోసం కొన్ని సూపర్ టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే మరకలను ఈజీగా పోగొట్టడమే కాకుండా యూనిఫామ్స్‌ను కొత్తవాటిలా తెల్లగా మెరిపించవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మరసం : యూనిఫామ్ మరకలు పోగొట్టడంలో నిమ్మరసం మంచి బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆమ్లం మరకలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఇందుకోసం ఒక నిమ్మ చెక్కను తీసుకొని స్కూల్ యూనిఫామ్‌పై మరకలు ఉన్న చోట బాగా రుద్దాలి. ఆపై సబ్బు నీటిలో నానబెట్టి బ్రష్‌తో రుద్ది వాష్ చేసుకుంటే మరకలు ఈజీగా తొలగిపోతాయంటున్నారు.
వెనిగర్ : ఇదీ యూనిఫామ్స్‌పై మొండి మరకలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు. దీనిలో పుష్కలంగా ఉండే బ్లీచింగ్ ఏజెంట్ లక్షణాలు అందుకు చాలా బాగా సహాయపడతాయి. ఇందుకోసం ఒక బకెట్లో కొద్దిగా వాటర్ తీసుకొని అర కప్పు వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. ఆపై ఆ వాటర్‌లో మరకలు ఉన్న యూనిఫాంను ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. అనంతరం బ్రష్‌తో స్క్రబ్ చేసి వాష్ చేసుకుంటే చాలు. ఎలాంటి మరకలైనా ఇట్టే పోతాయంటున్నారు నిపుణులు.
బేకింగ్ పౌడర్ : ఇందుకోసం ఒక చిన్నబౌల్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని యూనిఫామ్‌పై మరకలున్న చోట అప్లై చేసుకోవాలి. కాసేపటి తర్వాత బ్రష్‌తో రుద్ది వాష్ చేసుకుంటే ఈజీగా మరకలు తొలగిపోతాయట.
ఇలా చేసినా మంచి రిజల్ట్ : స్కూల్ యూనిఫామ్‌పై పెన్ను గీతలు, ఫుడ్ లేదా బురద వంటి మరకలు పడినప్పుడు ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటంటే.. మరకలు ఉన్నవాటిని తీసుకొని ముందుగా కొద్దిగా సబ్బు పెట్టి బాగా రుద్ది పిండాలి. ఆపై మళ్లీ వాటిని వాష్ చేసుకుంటే సరిపోతుంది. మరకలు తొలగిపోయి బట్టలు కొత్తవాటిలా కనిపిస్తాయంటున్నారు!
అలాగే.. పిల్లల స్కూల్ యూనిఫాంలను ఉతికేటప్పుడు మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. వాటిని వీలైనంత వరకు వేరే దుస్తులతో కలిపి నానబెట్టకుండా చూసుకోవాలి. అదేవిధంగా.. ఇతరుల దుస్తులతో కలిపి యూనిఫామ్స్‌ను వాషింగ్ మెషిన్లో వేయకపోవడం మంచిది. ఎందుకంటే.. పెద్దవారి బట్టలకు ఉన్న క్రిములు పిల్లల దుస్తులకు వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి.. పిల్లల బట్టలను సెపరేట్‌గా వాష్ చేయడమే బెటర్ అంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
మీ దుస్తుల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోందా? - ఇలా చేస్తే ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయి!
వానాకాలంలో దుస్తులు సరిగా ఆరక వాసన వస్తున్నాయా? - ఈ టిప్స్ పాటిస్తే ఫ్రెష్ అండ్ సువాసన పక్కా!