ETV Bharat / offbeat

మీ బరువుకు కారణం కొవ్వు కాదు - ఒంట్లో చేరిన నీరు కావచ్చు! - ఇలా చేస్తే పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది! - Reduce Body Water Weight - REDUCE BODY WATER WEIGHT

Reduce Body Water Weight : చాలా మంది బరువు పెరగడానికి ఒంట్లో నీటి శాతం పెరగడమూ ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, శరీరంలో పేరుకుపోయిన అధిక నీటిని తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేదిక్ రెమిడీ పట్టుకొచ్చాం. మరి, ఏంటి ఆ రెమిడీ? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

REDUCE EXCESS WATER IN THE BODY
Reduce Body Water Weight (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 12:59 PM IST

Best Remedy To Reduce Excess Water in The Body : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తగిన శారీర శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, నిలబడడం వల్ల బాడీ చుట్టూ ద్రవాలు సరిగా ప్రసరించడం ఆగిపోతాయి. దాంతో శరీర కణజాలం చుట్టూ నీటి శాతం పేరుకుపోతుంది. ఫలితంగా బరువు(Weight) పెరిగిపోతుంటారు. మీరూ ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? అయితే, మీకోసం ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ దివ్యౌషధం తీసుకొచ్చాం. దాన్ని మజ్జిగతో ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నారంటే చాలు.. శరీరంలో పేరుకుపోయిన అధిక నీరు ఇట్టే తగ్గిపోతుందంటున్నారు ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • మజ్జిగ - 600 మిల్లీ లీటర్లు
  • వాము పొడి - 15 గ్రాములు
  • ఉసిరి చూర్ణం - 15 గ్రాములు
  • కరక్కాయ చూర్ణం - 15 గ్రాములు
  • సైందవ లవణం - సుమారు 7 నుంచి 8 గ్రాములు
  • మిరియాల పొడి - 15 గ్రాములు
  • సవర్శలవణం - సుమారు 7 నుంచి 8 గ్రాములు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన పల్చటి మజ్జిగను ప్రిపేర్ చేసుకోవాలి. అంటే.. పెరుగుని ఒక భాగం తీసుకుంటే, మూడు భాగాల వాటర్ తీసుకొని బాగా చిలికి పల్చటి మజ్జిగను రెడీ చేసుకోవాలి.
  • అదేవిధంగా వామును వేయించి పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే.. కావాల్సిన పరిమాణంలో కరక్కాయను చూర్ణాన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి.
  • వీటితో పాటు ఎండబెట్టిన ఉసిరికాయలను తీసుకొని కావాల్సిన మోతాదులో పొడిని సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మిరియాల పొడిని ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక బౌల్​లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్చటి మజ్జిగ తీసుకోవాలి. ఆపై అందులో వాము పొడి, కరక్కాయ చూర్ణం, ఉసిరి పొడి, మిరియాల పొడి.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆ తర్వాత అదే మిశ్రమంలో పైన తీసుకున్న వాటికంటే సగం పరిమాణంలో చూర్ణం చేసుకున్న సైందవ లవణం, సవర్శ లవణం వేసుకోవాలి. ఈ సవర్శ లవణం అనేది కూడా ఒక రకమైన ఉప్పు.
  • ఇలా మజ్జిగలో అన్నింటినీ వేసుకున్నాక మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని మూతపెట్టి మూడు రోజుల పాటు పులియనివ్వాలి.
  • ఇలా చేయడం ద్వారా మజ్జిగ బాగా పులుస్తుంది. అలాగే.. అందులో వేసుకున్న ద్రవ్యాలన్నీ మజ్జిగలో మంచిగా కలిసి ఒక చక్కటి పత్యాహారం లాంటి ఔషధం తయారవుతుందంటున్నారు డాక్టర్ గాయత్రీ దేవి.

దీన్ని ఎలా తీసుకోవాలంటే?

ఈ మజ్జిగ ఔషధాన్ని ఉదయం, సాయంత్రం 30 మిల్లీ లీటర్ల పరిమాణంలో తీసుకొని తాగాలి. ఈవిధంగా డైలీ రెండు పూటల తాగడం వల్ల కాళ్లు, ఇతర భాగాలలో అక్కడ ఎక్కువగా ఉండిపోయినటువంటి నీరు అంతా బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా ఆయా భాగాలలో వాపులు తగ్గడానికి మజ్జిగ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందంటున్నారు ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవి.

ఇవీ చదవండి :

బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ - "హెల్దీ స్ప్రౌట్స్ పోహా" - సింపుల్​గా ఇలా ప్రిపేర్ చేసుకోండి!

40 ఏళ్లు దాటాక బరువు తగ్గాలా? - ఇలా చేస్తే సింపుల్​గా వెయిట్​ లాస్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.