ETV Bharat / offbeat

'భర్త నా మాట వినట్లేదు - అమ్మ, అక్క చెప్పిందే చేస్తున్నాడు- నేనేం చేయాలి'? - Psychiatrist Advice in Telugu - PSYCHIATRIST ADVICE IN TELUGU

కొన్నిసార్లు కుటుంబంలో వచ్చే చిన్నచిన్న సమస్యలు చిక్కుముళ్లుగా మారి.. రోజువారి జీవితాలను భారంగా చేస్తాయి. అలాంటి ఓ పెళ్లైన అమ్మాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ స్టోరీ ఇది. నిపుణులు ఏం చెప్పారు చూడండి.

Psychiatrist Advice for Family Problems
Psychiatrist Advice for Family Problems (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2024, 2:24 PM IST

Psychiatrist Advice for Family Problems : కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు అత్తవారింట్లో సర్దుకుపోవడానికి కొంత టైమ్ పడుతుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు అత్తాకోడళ్లు, ఆడపడుచులతో విబేధాలు కూడా తలెత్తుతుంటాయి. ఇక అబ్బాయిల విషయానికి వస్తే.. తన జీవితంలోకి అడుగుపెట్టిన భార్య కంటే.. అమ్మ, అక్కల మాటలే ఎక్కువగా వింటుంటారు. దీంతో భార్యకు.. భర్త తన మాట వినడం లేదని కోపం వస్తుంటుంది. అలాగే ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితే ఒక అమ్మాయికి ఎదురైంది.

ఇదీ సమస్య..

ఆ జంటకు పెళ్లై ఏడాది పూర్తవుతోంది. అబ్బాయి ప్రతి విషయంలోనూ భార్య కంటే.. తల్లీ, అక్కలు చెప్పిన మాటలు ఎక్కువగా వింటున్నాడు. వారు అంగీకరిస్తే తప్ప ఏ పనీ చేయట్లేదు. దీంతో 'మా సంసారంలో వాళ్ల పెత్తనమేంటి? ఈ జోక్యం చేసుకోవడం నచ్చడం లేదు.' అంటోంది భార్య. ఈ విషయం తన భర్తకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటూ మానసిక నిపుణుల సహాయం కోరింది. దీనికి ప్రముఖ మానసిక నిపుణురాలు 'డాక్టర్​ మండాది గౌరీదేవి' చక్కటి పరిష్కారం చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

అది పరిష్కారం కాదు..

సాధారణంగా మ్యారేజ్​కి ముందు ప్రతీ అమ్మాయి.. భర్త, పిల్లలు, సంసారం, కుటుంబం.. వంటి విషయాల గురించి కొన్ని కలలు కంటుంటారు. కొంతమంది తమ అభిప్రాయాలను పెళ్లికి ముందే కాబోయే భాగస్వామితో చర్చిస్తారు. అయితే.. మీ ఆయన అన్ని విషయాలు అమ్మ, అక్కలతోనే చర్చించి నిర్ణయిస్తూ, మీకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంవల్ల అసంతృప్తికి లోనవడం, గొడవలు పడటం జరుగుతున్నట్టుంది. ఇది సహజమే. కానీ.. గొడవ చేస్తే మీ సమస్య పరిష్కారం కాదు.

"పుట్టిన దగ్గర్నుంచి మీ భర్త వారితో కలిసి ఉండడం వల్ల వాళ్లను అడిగి నిర్ణయాలు తీసుకోవడం అలవాటై ఉండొచ్చు. ఈ విషయం అతనికి చాలా సాధారణం. మీకు మాత్రం మీ సంసారం, మీ లైఫ్​ గురించి వేరే ఆలోచనలు ఉండటంతో దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఈ కారణంగా.. వారు ఆధిపత్యం చెలాయిస్తున్నారనే బాధతో కోపం, చిరాకు ప్రదర్శించడం చేస్తున్నారు." -డాక్టర్​ మండాది గౌరీదేవి (మానసిక నిపుణురాలు)

ప్రేమగా ఉండండి..

దాంపత్యంలో ఒకరిమీద మరొకరికి నమ్మకం, ఇష్టం కలగాలంటే పార్ట్​నర్​కి కొంత సమయం ఇవ్వాలి. పెళ్లైన కొత్తలో భార్య మాట భర్త వినడానికి టైమ్ పడుతుంది. అత్త, ఆడపడుచులకు కూడా నిన్ను తమలో ఒకరిగా ఇముడ్చుకోవడానికీ టైమ్​ పడుతుంది. కోడలిగా వచ్చిన మీరు.. వారిపై ఆధిపత్యం చెలాయిస్తారనే భయం కూడా వారికి ఉండొచ్చు. కాబట్టి.. ముందు మీవారితో ప్రేమ, అనుబంధం, అప్యాయత పెంచుకోండి.

వేచి చూడండి..

అది మన ఫ్యామిలీ అని మీరు కూడా భావిస్తున్నట్టుగా మీ భర్తకు అర్థమయ్యేలా ఉండండి. ఇలా చేస్తే.. భవిష్యత్తులో మీపై నమ్మకం కలుగుతుంది. అలాగే మీ కుటుంబ చర్చల్లో పాల్గొనండి. ఎవరైనా చెప్పింది నచ్చితే అంగీకరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆధిపత్యం గురించి పదే పదే కంప్లైంట్​ చేయొద్దు. అది నెగటివ్​గా ఆలోచించేలా చేస్తుంది. ఇవి పాటిస్తే.. ఫ్యూచర్​లో మీ భర్తలో తప్పక మార్పు వస్తుంది. కాబట్టి కొంత ఓపికగా వేచి చూడండి అని మండాది గౌరీదేవి సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇది కూడా చదవండి..

'తనకు నచ్చినట్టుగా ఉండాలని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు - నేనేం చేయాలి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.