ETV Bharat / offbeat

కుక్కర్‌ నుంచి వాటర్‌ లీకై కిచెన్ మొత్తం​ పాడైపోతోందా ? - ఈ టిప్స్​ పాటిస్తే ఈజీగా చెక్​ పెట్టొచ్చు! - PRESSURE COOKER LEAKAGE PROBLEM

-కుక్కర్​ వాటర్​ లీకేజీతో ఇబ్బందులు -ఈ చిట్కాలతో ఇక నో టెన్షన్​!

Pressure Cooker
Pressure Cooker Leaking Water (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2024, 3:33 PM IST

Tips to Avoid Pressure Cooker Leaking Water : దాదాపు మనందరి ఇళ్లలో ప్రెషర్​ కుక్కర్​ కచ్చితంగా ఉంటుంది. పప్పు, కూరగాయలు, నాన్​వెజ్​ వంటకాలు ఏవైనా సరే ప్రెషర్​ కుక్కర్లో వండితే చాలా త్వరగా ఉడికిపోతాయి. అందుకే ఎక్కువ మంది మహిళలు ఇందులోనే వంట చేస్తుంటారు. అయితే, ప్రెషర్​ కుక్కర్లో వంట చేసే క్రమంలో కొన్నిసార్లు కుక్కర్ మూత నుంచి వాటర్ లీక్ అవుతుంటుంది. దీంతో కుక్కర్​ మూతపై మరకలు పేరుకుపోతాయి. అలాగే గ్యాస్​ స్టౌపై కూడా మరకలు పడుతుంటాయి. అయితే, కుక్కర్లో వంట చేసేటప్పుడు కొన్ని టిప్స్​ పాటించడం వల్ల ఇలా వాటర్​ లీక్​ కాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్​ ఏంటో మీరు చూసేయండి.

రబ్బర్​ చెక్​ చేయండి..: ఎక్కువ మంది కుక్కర్లో వంటచేసే ముందు పాత్ర శుభ్రంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. కానీ, రబ్బర్​ (గ్యాస్కెట్‌) గురించి అస్సలు పట్టించుకోరు. దానిని ఏదోలా ఫిట్​ చేసి వంట చేస్తుంటారు. అయితే, రబ్బర్​ సరిగా అమర్చకపోవడం వల్ల కుక్కర్​ నుంచి వాటర్​ లీక్​ అవుతుంది. కాబట్టి, రబ్బర్​ చక్కగా టైట్​గా అమర్చండి.

డీప్ ఫ్రిడ్జ్​లో పెట్టండి..: రబ్బర్​ కాస్త వదులుగా ఉన్నట్లు అనిపిస్తే.. డీప్ ఫ్రిడ్జ్​లో 15 నిమిషాలు ఉంచండి. ఇలా చేస్తే రబ్బర్​ గట్టిగా మారుతుంది. తర్వాత కుక్కర్​కి అమర్చి ఈజీగా వంట చేసుకోవచ్చు. దీనివల్ల కుక్కర్​ నుంచి వాటర్​ లీకేజీ బాధ తప్పుతుంది. అలాగే రబ్బర్​ చాలా కాలం నుంచి ఉపయోగిస్తుంటే వదులుగా మారిపోతుంది. దీనివల్ల కూడా వాటర్​ లీక్​ అవుతుంది. మరీ వదులుగా మారితే కొత్తది యూజ్​ చేయండి.

వెనిగర్​ నీటిలో.. వంట చేసే ముందు రబ్బర్​ని వెనిగర్​ నీటిలో అరగంటపాటు ఉంచండి. తర్వాత కుక్కర్​ మూతకి రబ్బర్​ని అమర్చి వంట చేయండి. ఇలా చేస్తే కుక్కర్​ వాటర్​ లీకేజీని అరికట్టవచ్చు. అలాగే రబ్బర్​ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

మరికొన్ని చిట్కాలు..

  • కుక్కర్​ విజిల్స్​తో పాటు లోపలి భాగాన్ని కూడా నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • వంట చేసే ముందు కుక్కర్లో కొద్దిగా నూనె వేయండి. దీని వల్ల కుక్కర్‌లోని ఆహార పదార్థాలు.. పాత్రకు అంటుకోకుండా, విడివిడిగా మృదువుగా కూడా కుక్‌ అవుతాయి. అలాగే వాటర్​ లీక్​ కాదు.
  • కుక్కర్‌ మూతకు ఉన్న సేఫ్టీ ప్లగ్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్​ చేసుకోవాలి. ఒక్కోసారి వీటి వాచర్‌లు తేలికగా ఉంటే కూడా వాటర్ లీక్ అవుతుంది.
  • కుక్కర్‌లో పదార్థాలను వండుతున్నప్పుడు ఒకేసారి మూతను బిగించకండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మూతను బిగిస్తే వాటర్‌ అనేది లీక్‌ కాకుండా ఉంటుంది.
  • వంట చేసిన తర్వాత కుక్కర్‌ విజిల్‌ను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆహార పదార్థాలను వండినప్పుడు కొన్ని పదార్థాలు ఈ విజిల్‌లో ఇరుక్కుపోతాయి. దీనివల్ల సరైన టైమ్​లో విజిల్ రాదు. ఫలితంగా పదార్థాలు కూడా ఎక్కువగా ఉడికిపోతాయి.
  • కుక్కర్లో వంట చేసేటప్పుడు ఎప్పుడైనా.. గ్యాస్ స్టౌవ్‌ను.. మీడియమ్‌ ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లెమ్‌లో స్టౌవ్‌ను పెడితే.. ప్రెషర్‌ అంతా ఒకేసారి రిలీజ్‌ అవుతుంది. దీనివల్ల కూడా వాటర్​ లీక్‌ అవుతుంది.
  • అలాగే కుక్కర్లో ఎక్కువగా నీళ్లు పోయకూడదు. అందులోని పదార్థాలను బట్టి.. అవి ఉడికే విధంగా పోయాలి. ఎందుకంటే వాటర్​ ఎక్కువగా ఉంటే విజిల్‌ వచ్చే సమయంలో వాటర్‌ లీక్‌ అవుతుంది. కాబట్టి వంట చేసేటప్పుడు ఈ టిప్స్​ పాటించడం వల్ల కుక్కర్​ నుంచి వాటర్​ లీక్​ కాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మీ ఇంట్లో ఎలక్ట్రిక్​ కెటిల్​ ఉందా ? ఎక్కువ కాలం పాటు పని చేయాలంటే ఇలా చేయాల్సిందే!!

పండక్కి వంటింట్లోని పాత్రలు క్లీన్ చేస్తున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే తెల్లగా మెరవడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.