ETV Bharat / offbeat

పచ్చిరొయ్యల నిల్వ పచ్చడి - ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే - నాలుక నాట్యమాడాల్సిందే! - Prawn Pickle Recipe

Prawn Pickle Recipe : మీకు రొయ్యల పచ్చడి అంటే ఇష్టమా? చాలా సింపుల్​గా మీరే ఇలా తయారు చేసుకోండి. పక్కా కొలతలతో ప్రిపేర్ చేస్తే.. ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాదు టేస్ట్​ కూడా అద్దిరిపోతుంది. మరి.. ఈ సూపర్ టేస్టీ "రొయ్యల పచ్చడి" ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Prawn Pickle
Prawn Pickle Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 20, 2024, 2:40 PM IST

How to Make Prawn Pickle in Telugu : చాలా మంది ఇష్టపడే సీ ఫుడ్ ఐటమ్స్​లో ఒకటి.. రొయ్యలు. వీటితో నిల్వ పచ్చడి పెట్టుకుంటే రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి.. పక్కా ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మారినేషన్ కోసం :

  • రొయ్యలు - అర కేజీ(పొట్టు తీసినవి)
  • పసుపు - అర టీస్పూన్
  • ఉప్పు - 1 టీస్పూన్

మసాలా పొడి కోసం :

  • దాల్చిన చెక్క - 1
  • లవంగాలు - 4
  • యాలకులు - 2
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్

పచ్చడి కోసం :

  • నూనె - 150ఎంఎల్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - తగినంత
  • పసుపు - 1 టీస్పూన్
  • కారం - 4 టేబుల్ స్పూన్లు
  • నిమ్మకాయలు - 2

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా మీడియం సైజ్​లో ఉండే రొయ్యలను కిలో ఎంచుకోవాలి.
  • వాటి పైపొట్టును తొలగించుకుంటే అవి అరకేజీ అవుతాయి. ఆపై వాటిని నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత రొయ్యలకి పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు పట్టించి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం ద్వారా రొయ్యలలో ఉండే నీచు వాసన పోతుంది.
  • ఆ లోపు పచ్చడిలోకి కావాల్సిన మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ మీద దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు వేసి అవి రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
  • అనంతరం అవి చల్లారాక మిక్సీ జార్​లో వేసుకొని మెత్తని పౌడర్​లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై.. లోతుగా ఉండే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. అందులో ముందుగా మారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి గరిటెతో కలుపుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి.
  • ఇలా రొయ్యలను దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంటే.. రొయ్యలనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి రావాలి.
  • పైన కొంచం క్రిస్పీగా అవ్వాలి. అంతవరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • ఆ విధంగా ఫ్రై చేసుకున్నాక వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మంటను లో ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని అదే కళాయిలో ఫ్రెష్​గా రుబ్బిపెట్టుకున్న అల్లంవెల్లుల్లి పేస్ట్​ను వేసి 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ బాగా వేగి గోల్డెన్ కలర్​లోకి వచ్చాక.. అందులో ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు గరిటెతో అలా కదుపుతూ ఉండాలి.
  • అనంతరం దానిలో పసుపు, కారం వేసుకొని ఒకసారి మిశ్రమం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని ఆ మిశ్రమంలో వేసి స్టౌ లో-ఫ్లేమ్​లో ఉంచి ఒక నిమిషం పాటు గరిటెతో కలుపుతూ వేడి చేసుకోవాలి. లేదంటే.. పచ్చడి చేదు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • అప్పుడు స్టౌ ఆఫ్ చేసుకొని.. ఆ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పాన్​ను పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి.
  • ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిందనుకున్నాక.. అందులో నిమ్మరసం పిండుకోవాలి. ఇక చివరగా ఓసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని దాన్ని గాలి చొరబడని కంటైనర్​లో స్టోర్ చేసుకోవాలి. అంతే.. నోరూరించే "రొయ్యల నిల్వ పచ్చడి" రెడీ!
  • ఈ పచ్చడి దాదాపు నెలన్నర నుంచి 2 నెలల పాటు నిల్వ ఉంటుంది! డౌట్ ఉన్నవాళ్లు దీన్ని ఫ్రిజ్​లో కూడా స్టోర్ చేసుకోవచ్చు.

ఇవీ చదవండి :

ఆంధ్రా స్టైల్​లో చికెన్ పచ్చడి - ఇలా ప్రిపేర్ చేశారంటే సూపర్​ టేస్ట్​!

"ఆంధ్ర స్టైల్​ మటన్ మసాలా" కర్రీ - ఒక్కసారి ఇలా చేసి చూడండి! - టేస్ట్ అద్దిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.