ETV Bharat / offbeat

నోరూరించే రెస్టారెంట్ స్టైల్ "చికెన్ మలై టిక్కా" - ఇంట్లోనే సులువుగా చేసేయండిలా! - MALAI CHICKEN TIKKA RECIPE

చికెన్ టిక్కా కోసం రెస్టారెంట్​కి వెళ్లాల్సిన పని లేదు - ఇంట్లోనే ఈజీ​గా ప్రిపేర్ చేసుకోండిలా!

Chicken Malai Tikka Recipe
CHICKEN TIKKA RECIPE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2024, 4:52 PM IST

Chicken Malai Tikka Recipe in Telugu : వెజ్, నాన్​వెజ్ టిక్కా వీటిలో దేన్ని చూసినా నోరూరుతుంది. అందులోనూ చికెన్​ టిక్కా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, చాలా మంది చికెన్ టిక్కా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుందని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి వెనకాడుతుంటారు. అందుకే సులువుగా చేసుకునేలా ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "రెస్టారెంట్ స్టైల్ మలై చికెన్ టిక్కా". టేస్ట్ అద్భుతంగా ఉంటుంది! ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బోన్​లెస్ చికెన్ - అరకిలో
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్​స్పూన్
  • కొత్తిమీర కాడల సన్నని తరుగు - 2 టీస్పూన్లు
  • సన్నని పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • నిమ్మరసం - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీడిపప్పు పలుకులు - 3 టేబుల్​స్పూన్లు
  • దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
  • యాలకులు - 3
  • లవంగాలు - 3
  • ప్రాసెస్డ్ చీజ్ క్యూబ్ - 1
  • ఫ్రెష్ క్రీమ్ - 4 టేబుల్​స్పూన్లు
  • హంగ్ కర్డ్ - 2 టేబుల్​స్పూన్లు
  • తెల్ల మిరియాల పొడి - 1 టీస్పూన్
  • రిఫైన్డ్ సన్​ఫ్లవర్ ఆయిల్ - 1 టేబుల్​స్పూన్
  • నూనె - 2 టీస్పూన్లు
  • క్రీమ్ చీజ్ - 2 టేబుల్​స్పూన్లు
  • చాట్ మసాలా - కొద్దిగా

పార్టీ స్పెషల్ : ఫుల్ టేస్టీ వెల్లుల్లి కోడి వేపుడు - తిని తీరాల్సిందే!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బోన్​లెస్​ చికెన్​ని​ తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై చికెన్​ని శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో తాజా అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కాడల సన్నని తరుగు, సన్నని పచ్చిమిర్చి తరుగు, అరచెక్క నిమ్మరసం, ఉప్పు వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కోట్ చేసుకోవాలి. అనంతరం ఆ బౌల్​ని ఫ్రిజ్​లో ఉంచి కనీసం 1 గంటపాటైనా ఊరనివ్వాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన జీడిపప్పు పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు పలుకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని మరీ మెత్తగా కాకుండా సన్నని బొంబాయి రవ్వ మాదిరిగా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
  • గంట తర్వాత ఫ్రిజ్​లో ఉంచిన చికెన్​ని తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు మిశ్రమం, ప్రాసెస్డ్ చీజ్ క్యూబ్​ని తురుమి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్​స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, హంగ్ కర్డ్ వేసుకొని అన్నీ ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో తెల్ల మిరియాల పొడి, రిఫైన్డ్ సన్​ఫ్లవర్ ఆయిల్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఆపై దాన్ని ఫ్రిజ్​లో ఉంచి అరగంట పాటు అలా వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా చికెన్ ముక్కలపై కోటింగ్ స్టఫ్​గా అవుతుంది.

"చికెన్​ లెగ్​ పఫ్స్" తిన్నారా?​ - ఇలా ట్రై చేయండి - టేస్ట్​ కిర్రాక్​ అంతే!

  • ఇప్పుడు స్టౌపై నాన్​స్టిక్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక ఫ్రిజ్​లో అరగంట నానబెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని కదపకుండా హై ఫ్లేమ్ మీద మూడు, నాలుగు నిమిషాలు కాలనివ్వాలి.
  • ఆ తర్వాత మరో వైపునకు టర్న్ చేసుకొని కాసేపు కాల్చుకోవాలి. ఆపై అరకప్పు వాటర్ పోసుకొని మూతపెట్టి లో ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే.. చికెన్ ముక్కలు 80 శాతం వరకు ఉడికితే సరిపోతుంది.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక ఆ చికెన్​ ముక్కలను ముందుగా మారినేట్ చేసుకున్న బౌల్​లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టేబుల్​స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అనంతరం చల్లారిన చికెన్​ ముక్కలను అర అంగుళం గ్యాప్​తో మెటల్ స్కీవర్స్​కు గుచ్చుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి దాని మీద చికెన్ గుచ్చుకున్న స్కీవర్స్​ను తిప్పుకుంటూ కాల్చుకోవాలి.
  • డార్క్ రెడ్ కలర్ వచ్చేంత చికెన్ ముక్కలను కాల్చుకున్నాక.. వాటిని ఒక సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకొని వాటిపై చీజ్ క్రీమ్ అప్లై చేసుకొని, చాట్ మసాలా చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "రెస్టారెంట్ స్టైల్ మలై చికెన్ టిక్కా" రెడీ!

వింటర్​ స్పెషల్​ - యమ్మీ యమ్మీ "చికెన్​ సమోసా" - ఈవెనింగ్​ టైమ్​ పర్ఫెక్ట్​ స్నాక్​ - టేస్ట్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.