ETV Bharat / offbeat

పులావ్, బిర్యానీలోకి సూపర్ సైడ్ డిష్ "మఖానా రైతా" - అద్దిరిపోయే రుచితో చేసుకోండిలా!

-రెగ్యూలర్​ రైతాను మించిన సూపర్​ టేస్ట్​ -ఈ టిప్స్​ పాటిస్తే నిమిషాల్లో రెడీ

How to Make Makhana Raita
Makhana Raita Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 12, 2024, 10:20 AM IST

How to Make Makhana Raita Recipe: దసరా వేళ ఒక సూపర్ సైడ్ డిష్ తీసుకొచ్చాం. అదే.. "మఖానా రైతా". పండగ రోజు మీ ఇంట్లో బిర్యానీ, పులావ్ చేసుకుంటే అందులోకి సైడ్ డిష్​గా ఎప్పటిలా మజ్జిగ, చారు కాకుండా.. ఈ రైతాను ప్రిపేర్ చేసి ఇవ్వండి. తిన్న ఎవరైనా సరే ఎలా చేశావు.. సూపర్​గా ఉంది అని పొగడక మానరు. అంత రుచికరంగా ఉంటుంది ఈ రైతా! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ మఖానా రైతా తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • నెయ్యి - అర టీస్పూన్
  • ఫూల్ మఖానా(తామర గింజలు) - 1 పెద్ద కప్పు
  • పెరుగు - 1 పెద్ద కప్పు
  • సన్నని అల్లం తురుము - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 2(సన్నగా తరుక్కోవాలి)
  • మిరియాల పొడి - కొద్దిగా
  • చాట్ మసాలా - చిటికెడు
  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • ఆవాలు - అర టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • జీలకర్ర - అర టీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పసుపు - పావు చెంచా

దసరా పార్టీకి సూపర్ పార్ట్​నర్ - పంజాబీ స్టైల్ "పటియాలా చికెన్ కర్రీ" - అద్దిరిపోవాల్సిందే!

తయారీ విధానం :

  • ఇందుకోసం మందుగా స్టౌపై పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక అందులో ఫూల్ మఖానాను వేసుకోవాలి. ఆపై స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి కలుపుతూ మఖానా పెళపెళమంటూ పేలిపోయే వరకు వేయించుకోవాలి.
  • అలా వేయించుకునేటప్పుడే అందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. మఖానా ఇంకా మంచిగా వేగుతాయి. అవి క్రిస్పీగా వేగిన తర్వాత పాన్​ని దింపి పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​లో బాగా కూల్​గా ఉండే చిలికిన పెరుగును తీసుకొని అందులో.. సన్నని అల్లం తురుము, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి అన్నీ కలిసేలా పెరుగును బాగా మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత దాన్ని మరో పెద్ద బౌల్​లోకి ట్రాన్స్​ఫర్ చేసుకొని వేయించుకొని చల్లార్చుకున్న మఖానాను కూడా అందులో వేసి మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

దసరా స్పెషల్​: ఘుమఘుమలాడే మద్రాస్​ స్టైల్​ "మటన్​ బకెట్​ బిర్యానీ" - తిన్నారంటే జిందగీ ఖుష్ అయిపోతుంది!!

  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. ముందుగా ఆవాలు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి.
  • తాలింపు వేగాక.. స్టౌ ఆఫ్ చేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేస్తే పసుపు మాడదు.
  • ఆ తర్వాత ఈ తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మఖానా మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "మఖానా రైతా" రెడీ!
  • ఇక దీన్ని గంటపాటు ఫ్రిజ్​లో ఉంచి తర్వాత వేడివేడి పులావ్, బిర్యానీలో వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అద్దిరిపోతుంది! అంతేకాదు.. ఈ రైతా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది!

దసరా స్పెషల్​ - వెజ్​ లవర్స్​ కోసం అద్దిరిపోయే "పనీర్​ మొఘలాయ్​ దమ్​ బిర్యానీ" - ఇలా ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.