ETV Bharat / offbeat

పప్పు నానబెట్టేది లేదు, రుబ్బేది లేదు - క్షణాల్లో అద్దిరిపోయే దోశలు వేసుకోవచ్చు! - INSTANT DOSA MIX Recipe - INSTANT DOSA MIX RECIPE

Instant Dosa Mix Powder : ఇంట్లో దోశలు వేసుకోవాలంటే అదో పెద్ద తతంగం. ముందు రోజు రాత్రే పప్పు నానబెట్టుకోవాలి. పొద్దున లేచి రుబ్బుకోవాలి. ఆ తర్వాత దోశలు వేసుకొని తినాలి. పొరపాటున నానబెట్టడం మరిచిపోతే అంతే! అయితే.. ఈ పరిస్థితి లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఇది మీకు తెలుసా?

How to Make Instant Dosa Mix
Instant Dosa Mix Powder (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 3:22 PM IST

How to Make Instant Dosa Mix : చాలా మంది ఇష్టపడే బ్రేక్​ఫాస్ట్ ఐటమ్స్​లో ఒకటి.. దోశ. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, సాధారణంగా దోశలు ప్రిపేర్ చేసుకోవాలంటే.. ముందు రోజు రాత్రే పప్పు నానబెట్టుకోవాలి. మరుసటి రోజు పొద్దున రుబ్బుకోవాలి. అప్పుడు దోశలు వేసుకోవాలి. ఇదంతా శ్రమతో కూడుకున్న పని. ఇంకా టైమ్ టేకింగ్ ప్రాసెస్. కానీ, చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. అంత సమయం వెయిట్ చేయకుండానే అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు.

మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేడివేడిగా క్రిస్పీ, క్రిస్పీగా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. మీకు సమయం దొరికినప్పుడు "దోశ మిక్స్ పౌడర్" ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుందట. ఇంతకీ.. ఆ ఇన్​స్టంట్ దోశ పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దోశ మిక్స్ పౌడర్​ కోసం కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - మూడు కప్పులు
  • మినప పప్పు - కప్పు
  • ఉప్మారవ్వ - 2 టేబుల్ స్పూన్లు
  • శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • కందిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • అటుకులు - కప్పు
  • బేకింగ్ సోడా - చెంచా
  • మెంతులు - అర చెంచా
  • ఉప్పు - తగినంత

తయారీ విధానం :

  • దోశ మిక్స్ పౌడర్ తయారీ కోసం.. ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని శనగ, కంది, మినప పప్పు, మెంతులను పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
  • ఆ విధంగా వేయించుకున్నాక అందులోనే అటుకులు వేసి ఇంకాస్త వేయించుకోవాలి.
  • ఆపై వాటిని చల్లార్చుకొని.. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో బియ్యాన్ని కూడా వేయించి, వేడి తగ్గాక బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి.
  • అనంతరం ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో.. బరకగా మిక్సీ పట్టుకున్న బియ్యపు రవ్వ, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగ, కంది, మెంతులు కలిసిన మినప పప్పు పిండి, ఉప్మారవ్వ, తగినంత ఉప్పు, బేకింగ్ సోడా.. ఇలా ఒక్కొక్కటిగా వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అంతే.. మీరు కోరుకుంటున్న ఇన్​స్టంట్ "దోశ పౌడర్" రెడీ!
  • ఇక దీన్ని తడిలేని, గాలి చొరబడని సీసా లేదా జార్​లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చాలు.
  • మీరు ఎప్పుడంటే అప్పుడు ఇన్​స్టంట్​గా దోశలు వేసుకుని తినొచ్చంటున్నారు కుకింగ్ నిపుణులు.
  • ఈ ఇన్​స్టంట్ పౌడర్​తో ప్రిపేర్ చేసుకున్న దోశలతో శరీరానికి అందాల్సిన ప్రొటీన్లు, ఇతర పోషకాల విషయంలో ఎలాంటి తేడా ఉండదని కూడా అంటున్నారు.

ఇవీ చదవండి :

ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని పారేస్తున్నారా ? - ఇలా చేస్తే తాజాగా మారిపోతుంది!

దోశలు క్రిస్పీగా రావడం లేదా? ఈ టిప్స్ పాటిస్తూ వేస్తే సూపర్​ క్రిస్పీతో పాటు టేస్ట్ అద్దిరిపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.