ETV Bharat / offbeat

స్కూల్లో లంచ్ బాక్స్ తినకుండా పిల్లలు ఇంటికి తెస్తున్నారా? - ఈ 'గార్లిక్ రైస్' పెట్టండి - మొత్తం ఖాళీ చేసేస్తారు! - Chilli Garlic Ghee Rice Preparation

author img

By ETV Bharat Features Team

Published : 3 hours ago

Chilli Garlic Ghee Rice Preparation: స్కూల్​కు వెళ్లిన మీ పిల్లలు.. లంచ్ బాక్స్​ తినకుండా అలాగే తెస్తున్నారా? వారికి రొటీన్ వైట్​ రైస్ నచ్చట్లేదు కావొచ్చు. అందుకే.. ఈసారి "చిల్లీ గార్లిక్ ఘీ​ రైస్​" చేసి పెట్టండి. లంచ్​ బాక్స్​ పూర్తిగా ఖాళీ అవుతుంది. మరి.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలా? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Chilli Garlic Ghee Rice Preparation
Chilli Garlic Ghee Rice Preparation (ETV Bharat)

Chilli Garlic Ghee Rice Preparation: చాలా మంది తల్లులు.. పిల్లల లంచ్​ బాక్స్​లోకి రోజూ రొటీన్ అన్నం పెడుతుంటారు. అన్నంతో పాటు ఏదో ఒక కర్రీ పెట్టి స్కూల్​కు పంపిస్తుంటారు. ఫలితంగా రోజూ ఇలాంటి భోజనం తినడానికి చాలా మంది పిల్లలు అంతగా ఇష్టపడరు. అందుకే.. కొన్నిసార్లు అన్నం కొంచెం తిని పడేయడం లేదా బాక్స్​ మొత్తం అలాగే ఇంటికి పట్టుకురావడం చేస్తుంటారు.

అందుకే.. పిల్లల లంచ్​ బాక్స్​లోకి ఎప్పుడూ రొటీన్​గా కాకుండా వివిధ రకాల వెరైటీ రెసిపీలను పెడుతుండాలి. ఇలాంటి ఒక మంచి లంచ్​ బాక్స్​ రెసిపీని ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. అదే చిల్లీ గార్లిక్ ఘీ రైస్​. ఒక్కసారి ఇలా చెప్పిన విధంగా చేశారంటే పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా బాక్స్​ మొత్తం ఖాళీ చేసి వస్తారు. మరి, ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • ఒక కప్పు బాస్మతి బియ్యం
  • 25 వెల్లుల్లి పాయలు
  • 2 పచ్చిమిరపకాయలు
  • 2 టేబుల్ స్పూన్ల నెయ్యి
  • ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
  • ఒక ఇంచు దాల్చిన చెక్క
  • 2 లవంగాలు
  • 2 బిర్యానీ ఆకులు
  • 2 యాలకులు
  • ఒక అనాస పువ్వు
  • రెండు ఉల్లిపాయ ముక్కలు
  • రుచికి సరిపడా ఉప్పు
  • ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
  • 15 జీడిపప్పులు

తయారీ విధానం..

  • ముందుగా బాస్మతి బియ్యాన్ని తీసుకుని బాగా కడగాలి.
  • ఆ తర్వాత దానిలో మంచినీటిని పోసి సుమారు అరగంటపాటు నానబెట్టాలి.
  • మరోవైపు పొట్టు తీసేసిన వెల్లుల్లి పాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి కుక్కర్​లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
  • అనంతరం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, యాలకులు వేసి కలుపుకోవాలి.
  • ఇవన్నీ కాసేపు వేయించిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
  • ఇవి ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చీ- వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి.
  • అనంతరం ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని, ఉప్పును వేసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత ఒకటిన్నర కప్పుల నీటిని పోసి కలిపి మూత పెట్టుకోవాలి.
  • హై-ఫ్లేమ్​ పెట్టి కుక్కర్ ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకుని ఆ తర్వాత దించేసి మరోసారి బాగా కలపాలి.
  • ఇప్పుడు మరో గిన్నెను స్టౌపై పెట్టుకుని అందులో నెయ్యి పోసి వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోనే జీడిపప్పు వేసి ఎర్రగా వేగనివ్వాలి.
  • అనంతరం స్టౌ ఆఫ్ చేసి దానిని తీసుకువచ్చి బిర్యానీలో వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇంకా కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ చిల్లీ గార్లిక్ ఘీ రైస్ రెడీ అయిపోతుంది.

రక్తహీనత సమస్యా? - ఇలా బీట్​ రూట్ చపాతీ చేసేయండి - అద్దిరిపోయే రుచి, అదనపు ఆరోగ్యం - How to Prepare Beetroot Chapati

బయటి జిలేబీ అన్​ హెల్దీ కావొచ్చు! - ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి - రుచి అమృతమే! - Jalebi Recipe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.