ETV Bharat / offbeat

దీపావళికి ఏం స్వీటు చేస్తున్నారు? - ఈ "తొక్కుడు లడ్డూలు" ట్రై చేయండి - తియ్యని వేడుక చేసుకోండి! - THOKKUDU LADDU RECIPE

- ఇలా చేస్తే నిమిషాల్లోనే రెడీ అయిపోతాయ్!

Thokkudu Laddu
How to Make Thokkudu Laddu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 9:42 AM IST

How to Make Thokkudu Laddu : అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వెలుగుల పండగ దీపావళి వచ్చేసింది. దివాళీ అనగానే మనందరికీ నోరూరించే మిఠాయిలు గుర్తుకొస్తుంటాయి. సాయంత్రం లక్ష్మీదేవి పూజ అనంతరం.. ఏదైనా స్వీట్​ తిని సంతోషంగా బాణసంచా కాలుస్తుంటాం. మరి.. ఈ దీపావళి పండక్కి ఇంట్లో ఏ స్వీట్​ రెడీ చేయాలా ? అని మీరు ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ కథనం మీ కోసమే.

ఈ సారి ఎంతో కమ్మగా ఉండే తొక్కుడు లడ్డూలు ప్రిపేర్ చేయండి. వీటిని తయారు చేయడం చాలా ఈజీ. ఈ స్టోరీలో చెప్పిన విధంగా తయారు చేస్తే.. అచ్చం పాత కాలం పద్ధతిలో చేసినట్టుగా లడ్డూలు ఎంతో మృదువుగా వస్తాయి. నోట్లో వేసుకోగానే కరిగే ఈ లడ్డూలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఇక లేట్ చేయకుండా ఈ తొక్కుడు లడ్డూలను ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో? ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి-2 కప్పులు
  • పంచదార- 2 కప్పులు
  • యాలకుల పొడి- టీస్పూన్​
  • ఉప్పు -చిటికెడు
  • ఖర్బూజ గింజలు-కొద్దిగా
  • నూనె-డీప్​ ఫ్రైకి సరిపడా
  • నెయ్యి -టేబుల్​స్పూన్​
  • ఫుడ్​ కలర్​ - చిటికెడు

తయారీ విధానం..

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్​లో శనగ పిండి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, ఫుడ్​ కలర్​ వేసి కలపాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ జంతికల కోసం పిండి సిద్ధం చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి జంతికలు వేయించడానికి సరిపడా ఆయిల్​ వేయండి.
  • జంతికల గొట్టానికి కాస్త నూనె రాసి పిండి ముద్దని పెట్టండి. నూనె వేడయ్యాక జంతికలు చేసుకోవాలి.
  • జంతికలు క్రిస్పీగా కాకుండా.. కాస్త మెత్తగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే జంతికలు సిద్ధం అవుతాయి.
  • ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు పాకం కోసం స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో చక్కెర తగినన్ని నీళ్లు పోసి కరిగించండి.
  • కొద్దిగా తీగ పాకం వచ్చాక యాలకుల పొడి వేసి కలపండి. తర్వాత మిక్సీ పట్టుకున్న జంతికలపొడి కొద్దికొద్దిగా వేసుకుంటూ.. ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  • ఇందులోనే నెయ్యి, ఖర్బూజ గింజలు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకోవాలి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన తొక్కుడు లడ్డూలు రెడీ. నచ్చితే ఈ పండగకు మీరు తొక్కుడు లడ్డూలను ఈ విధంగా ట్రై చేయండి.
  • ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "ఆమ్లా బర్ఫీ" - ఇలా చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ - టేస్ట్​ సూపరంతే!

బియ్యంతో అద్దిరిపోయే స్వీట్ రెసిపీ - ఈ దీపావళికి ఓసారి ట్రై చేయండిలా! - టేస్ట్​కి ఇంట్లో వారందరూ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.