How to Make Soft Mysore Pak Recipe : స్వీట్ లవర్స్ ఎంతో ఇష్టంగా తినే మిఠాయిలలో మైసూర్ పాక్ కూడా ఒకటి. స్వీట్‌షాపు నుంచి తీసుకురావడమే ఆలస్యం ఇంట్లో వాళ్లందరూ మైసూర్ పాక్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అయితే, ఈ టేస్టీ మైసూర్ పాక్‌లలో రెండు రకాలుంటాయి. ఒకటి కాస్త క్రిస్పీగా ఉంటే.. మరొకటి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇంట్లోనే సాఫ్ట్ మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పండుగలు, శుభకార్యాల సమయంలో ఈ స్వీట్ ట్రై చేయండి. ఫ్యామిలీలో అందరికీ ఎంతో నచ్చుతుంది. ఇక ఆలస్యం చేయకుండా సాఫ్ట్ మైసూర్ పాక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానంపై ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు..
- చక్కెర-కప్పు
- శనగపిండి-కప్పు (చక్కెర ఏ కప్పుతో తీసుకుంటే.. అదే కప్పుతో శనగపిండి తీసుకోవాలి)
- నూనె అరకప్పు
- కాచి చల్లార్చిన పాలు -అరకప్పు
- ఉప్పు-చిటికెడు
- యాలకుల పొడి-టీస్పూన్
తయారీ విధానం..
- ముందుగా ఒక మిక్సీ జార్లో షుగర్ వేసుకుని పౌడర్ రెడీ చేసుకోండి.
- అలాగే ఒక పాన్‌లోకి శనగపిండి జల్లించి తీసుకోండి. ఇందులో నూనె పోసి పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఈ పాన్ని స్టౌపై పెట్టాలి. స్టౌ మీడియమ్ ఫ్లేమ్‌లో ఉంచుకుని శనగపిండి కలుపుతూ వేయించుకోవాలి. అంటే శనగపిండి ఉడికేటప్పుడు బుడగలు, మంచి స్మెల్ వచ్చే వరకూ గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి.
- పిండి కాస్త గట్టిగా మారిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. పంచదార పొడి కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలను పోసుకుని బాగా మిక్స్ చేయాలి.
- పిండి ఉండలు లేకుండా క్రీమ్‌లాగా రెడీ పాన్‌కు అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఉప్పు, యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. చివరగా స్వీట్ పైన నూనె పైకి తేలెంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు ఓ బాక్స్ తీసుకుని అందులో లైట్‌గా నూనె అప్లై చేయాలి. ఆ తర్వాత శనగపిండి మిశ్రమాన్ని అందులోకి వేసి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో ఈ స్వీట్‌ని కట్ చేసుకోండి. స్వీట్‌ను నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవడానికి చాకు కాకుండా దారం ఉపయోగిస్తే పీస్ చెదరకుండా పర్ఫెక్ట్గా వస్తుంది.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే.. ఎంతో టేస్టీ మైసూర్ పాక్ రెడీ. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ స్వీట్ ట్రై చేయండి.
ఈ పండక్కి మీ ఇంట్లో నేతి బొబ్బట్లు చేస్తారా? - మేం చెప్పినట్టు చేస్తే రుచి అమృతమే!
దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్‌దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీగా చేసుకోండిలా!