ETV Bharat / offbeat

దసరా స్పెషల్​ : పండగ రోజున అందరికీ నచ్చే "కమ్మటి పరమాన్నం" ఇలా చేసేయండి!

దసరా రోజున ఇంట్లో ఎన్ని వంటకాలున్నా.. నోరు తీపి చేసుకుంటేనే ఇంటిల్లిపాది సంతోషం రెట్టింపవుతుంది. అందుకే.. మీ కోసం ఎంతో రుచికరంగా ఉండే పరమాన్నం రెసిపీ తీసుకొచ్చాం. ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.

Paramannam Recipe
Paramannam Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 10:19 AM IST

Paramannam Recipe in Telugu : దసరా పండగ అంటేనే.. నోరూరించే పిండి వంటలు, ఘుమఘుమలాడే నాన్​వెజ్​ వంటకాలకు కేరాఫ్​ అడ్రస్​. ఇవే కాదండి.. వీటితోపాటు ఇంట్లో ఏదైనా ఒక స్వీట్​ తప్పకుండా ఉండాల్సిందే. అప్పుడే అసలైన పండగ మజా..! అయితే, ఈ దసరా రోజు ఇంట్లో ఏ స్వీట్​ చేయాలా? అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే, ఈస్టోరీ మీ కోసమే. అందరూ నచ్చేలా.. అందరికీ ఎంతో ఇష్టమైన పరమాన్నం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దాదాపు అందరూ ఈ రెసిపీ చేస్తారు. కానీ.. రుచికరంగా చేయడం అందరికీ రాదు. టేస్ట్​ పర్ఫెక్ట్​గా ఉంటేనే పండగ సంబరం రెట్టింపవుతుంది కదూ..! మరి ఇక లేట్​ చేయకుండా దసరా తీయని వేడుకల కోసం.. ఎంతో రుచికరమైన పరమాన్నం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • బియ్యం -కప్పు
  • పెసరపప్పు-అరకప్పు
  • శనగపప్పు-పావుకప్పు
  • పాలు-కప్పు
  • వాటర్​- 5 కప్పులు
  • బెల్లం -2 కప్పులు
  • యాలకులపొడి- అరటీస్పూన్​
  • పచ్చకర్పూరం-చిటికెడు
  • నెయ్యి-2 టేబుల్​స్పూన్లు
  • జీడిపప్పు-పావు కప్పు
  • కిస్​మిస్​-2టేబుల్​స్పూన్లు

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ పై గిన్నె పెట్టి పెసరపప్పు వేయాలి. పెసరపప్పు 4 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరొక గిన్నెలో బియ్యం, ఫ్రై చేసిన పెసరపప్పు, శనగపప్పు తీసుకోవాలి. వీటిని 2 సార్లు కడగాలి. తర్వాత 2 కప్పుల నీళ్లను పోసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు నానబెట్టుకోవడం వల్ల బియ్యం, పప్పులు చక్కగా ఉడుకుతాయి.
  • తర్వాత ఇందులోనే మరో మూడు కప్పుల నీళ్లు, పాలను పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టౌపై పెట్టి ఉడికించుకోవాలి.
  • స్టౌ మీడియమ్​ ఫ్లేమ్​లో పెట్టి రైస్​, పప్పులు ఉడికించుకోవాలి. రైస్​ ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసుకుని కలుపుకోవాలి.
  • పరమాన్నం కాస్త గట్టిగా మారిన తర్వాత ఇందులో యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ సన్నని మంట మీద పెట్టి ఉడికించుకోవాలి.
  • మరొక పక్కన స్టౌ పై పాన్​ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కిస్​మిస్​ వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇవి బాగా వేగిన తర్వాత పరమాన్నంలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ పరమాన్నం రెడీ.
  • దసరా పండగ రోజున ఇలా పరమాన్నం చేస్తే పర్ఫెక్ట్​గా వస్తుంది. మీరు కూడా ఈ పండగ రోజు పరమాన్నం ఇలా ట్రై చేయండి. టేస్ట్​ సూపర్​గా ఉంటుంది.

దసరా స్పెషల్​: ఘుమఘుమలాడే మద్రాస్​ స్టైల్​ "మటన్​ బకెట్​ బిర్యానీ" - తిన్నారంటే జిందగీ ఖుష్ అయిపోతుంది!!

దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్​దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీ​గా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.