How to Make Kalakand Recipe : స్వీట్లంటే అందరికీ ఇష్టమే. స్వీట్ బాక్స్ ముందు పెడితే చాలు.. ఒకటికి రెండు మిఠాయిలు తిని మనసు తృప్తి పరుచుకుంటారు. ఇక పండుగలు, శుభకార్యలు సమయంలో ఇంట్లో తప్పకుండా ఏదోక స్వీట్ తయారు చేస్తుంటారు మహిళలు. కానీ.. స్వీట్‌షాపుల్లో దొరికే తీయటి కలాకండ్ రెసిపీ మాత్రం చాలా మంది ట్రై చేయరు. ఇంట్లో చేస్తే కలాకండ్ సరిగా రాదని, కుదరదని వెనకడుగు వేస్తుంటారు. అందుకే మీ కోసమే ఈ స్టోరీ. పక్కా కొలతలతో ఎంతో ఈజీగా ఇంట్లోనే కలాకండ్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. కాస్త ఓపికగా చేసుకుంటే.. అచ్చం స్వీట్‌షాప్ స్టైల్ కలాకండ్ మీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా కమ్మటి కలాకండ్ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- చిక్కని పాలు- లీటర్
- పంచదార-100 గ్రాములు
- నెయ్యి- 2 టేబుల్‌స్పూన్లు
- నిమ్మరసం - 2 టేబుల్‌స్పూన్లు (కొన్ని నీళ్లలో నిమ్మరసం కలుపుకోవాలి)
- యాలకులపొడి-అరటీస్పూన్
తయారీ విధానం..
- ముందుగా స్టౌ పై మందపాటి కడాయి పెట్టుకోండి. ఇందులో చిక్కటి పాలు పోయండి. కలాకండ్ మరింత టేస్టీగా ఉండటానికి మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా ఉపయోగించవచ్చు.
- పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించండి. ఇలా పాలు మరుగుతున్నప్పటి నుంచి కొద్దిగా చిక్కగా మారేంత వరకు మధ్యమధ్యలో గరిటెతో మిక్స్ చేస్తూనే ఉండాలి.
- పాలపైన వచ్చే మీగడ కడాయికి అతుక్కోకుండా గరిటెతో పాలలోకి మిక్స్ చేస్తూ బాగా మరిగించాలి.
- పాలు సగం కంటే తక్కువగా మారిన తర్వాత స్టౌ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నిమ్మరసం వేయాలి.
- ఇప్పుడు పాలు విరిగిపోతాయి. పాలు విరిగిపోకపోతే మరికొద్దిగా నిమ్మరసం కలపండి.
- తర్వాత పాలలో కొద్దికొద్దిగా చక్కెర వేసి బాగా కలపాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి.
- కలాకండ్ ప్రిపేర్ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక కేక్ పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి రాయండి.
- పాన్‌లో కలాకండ్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి.
- పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుంటే నోరూరించే కలాకండ్ రెడీ.
- ఇలా సింపుల్‌గా ఇంట్లో చేసుకుంటే స్వీట్‌షాప్ స్టైల్ కలాకండ్ తయారైపోతుంది.
- ఈ స్వీట్ నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!
నోట్లో వేసుకుంటే కరిగిపోయే "డేట్స్ హల్వా" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - రుచి అమృతమే!